Vikrat Kohli Restuarant: లెజెండ్ సింగర్ కిషోర్ కుమార్ బంగ్లాలో కోహ్లీ రెస్టారెంట్.. విశేషాలివీ!!
విరాట్ కోహ్లీ.. ఇప్పుడు క్రికెట్ లో మాత్రమే కాదు.. స్టార్టప్ ప్రపంచానికి కూడా ఒక రోల్ మోడల్!!
- By Hashtag U Published Date - 06:20 AM, Fri - 2 September 22

విరాట్ కోహ్లీ.. ఇప్పుడు క్రికెట్ లో మాత్రమే కాదు.. స్టార్టప్ ప్రపంచానికి కూడా ఒక రోల్ మోడల్!!
క్రికెట్ లో , వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా వస్తున్న డబ్బును కోహ్లీ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. భవిష్యత్ పై స్పష్టతతో.. ముందుచూపుతో ఏరికోరి ఎంచుకున్న చోట్లలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఇలా పలు
ఫిట్‌నెస్ సెంటర్లు, బ్రాండెడ్ దుస్తులు, ఫుట్‌బాల్, టెన్నిస్ ఫ్రాంచైజీలు, రెస్టారెంట్లు, ఆడియో ఎక్విప్‌మెంట్ సంస్థల్లో విరాట్ పెట్టుబడులు పెట్టాడు. కొన్నింటిని సొంతంగా, మరికొన్నిట్లో భాగస్వామిగా కొనసాగుతున్నాడు.
ఈక్రమంలో త్వరలోనే కోహ్లీ ముంబై నగరంలో ప్రారంభించనున్న రెస్టారెంట్ కు ఒక స్పెషాలిటీ ఉంది. బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్‌కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయ నున్నారు. ఇందుకోసం కిషోర్ కుమార్‌కు చెందిన బంగ్లాలోని ‘గౌరీ కుంజ్’ పోర్షన్‌ను విరుష్క దంపతులు ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ”జుహు, ముంబై.. కమింగ్ సూన్” అంటూ కోహ్లీ హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి లీజు, ఇతర పనులను కోహ్లి లీగల్ అథారిటీ సెల్ దగ్గరుండి పర్యవేక్షించనుంది. కోహ్లి ప్రారంభించబోయే రెస్టారెంట్‌పై త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.విరాట్ కోహ్లి తన జెర్సీ నెంబర్ 18ను వన్8 కమ్యూన్ పేరిట తన స్వస్థలం ఢిల్లీతో పాటు కోల్‌కతా, పుణేలో రెస్ట్రోబార్స్ ఏర్పాటు చేశాడు. ముంబై లో ఏర్పాటు చేయనున్న కొత్త రెస్టారెంట్ కూడా ఇదే పేరుతో స్టార్ట్ కానుందని సమాచారం.
”ఐకానిక్ బంగ్లా”లో..
కిషోర్ కుమార్ బంగ్లాలో రెస్టారెంట్ ప్రారంభించాలన్న కోహ్లి ఆలోచనను కొంతమంది ప్రశంసించారు. ఇప్పటికే ఈ బంగ్లాకు ”ఐకానిక్ బంగ్లా” అని పేరు ఉంది. దిగ్గజం కిషోర్ కుమార్ ఇక్కడున్న చెట్లకు పలు పేర్లు పెట్టినట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన వాడిన వింటేజ్ కార్లు, వస్తువులు ఇక్కడి మ్యూజియంలో పెట్టారు. కిషోర్ కుమార్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అమిత్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఇదే బంగ్లాలో నివసిస్తుండడం విశేషం.
గతేడాది దిల్లీలో..
గతేడాది దిల్లీలోని ఆర్కే పురంలో న్యుయేవా పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఇందులో యురోపియన్, దక్షిణ అమెరికన్, పెరువియాన్ డిష్ ప్రత్యేకం. ఇటీవల ఐపీఎల్ సందర్భంగా బెంగళూరు ఆటగాళ్లు ఈ రెస్టారెంట్ లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.