White Hair Tips : తెల్ల జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరి చిప్పతో ఇలా చేయాల్సిందే..
మరి కొబ్బరి చిప్పలతో తెల్ల జుట్టు (White Hair) నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Naresh Kumar
Date : 02-01-2024 - 12:14 IST
Published By : Hashtagu Telugu Desk
White Hair Tips with Coconut Shell : మామూలుగా మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో ఉన్న కొబ్బరి నీళ్లు తాగి కొబ్బరి తీసుకొని ఆ కొబ్బరి చిప్పను పారేస్తూ ఉంటాం. కానీ ఆ వేస్ట్ గా పడేసిన కొబ్బరి చిప్పలు తెల్ల జుట్టును (White Hair) నల్లగా మారుస్తాయని మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. మరి కొబ్బరి చిప్పలతో తెల్ల జుట్టు (White Hair) నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
సహజంగా కొబ్బరికాయ చిప్పను చెత్తలో పడేస్తూ ఉంటారు. కొబ్బరి చిప్పను వాడడం వలన గాయం వాపు తగ్గిపోతుంది. కొబ్బరి చిప్పను రోజు ఉపయోగించడం వలన దంతాల మీద ఉన్న పసుపు మరకలు గార తొలగిపోతుంది. దీనికోసం ముందుగా కొబ్బరి పీచును కాల్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొద్ది కొద్దిగా సోడాతో కలిపి దంతాలు తప్పకుండా రోజు రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కొబ్బరి చిప్పను గ్రైండ్ చేసి పసుపు పొడిని కలిపి గాయమైన చోటులో పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరి చిప్పను మెత్తగా నూరి ఆ పొడిని రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో కలిపి తీసుకోవడం వలన ఫైల్స్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. బాణలిలో కొబ్బరి చిప్పను వేడి చేసి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు నల్లగా తయారవుతుంది.
కేవలం వీటికి మాత్రమే కాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వంటివి బాగా ఫేమస్ అయిన తర్వాత కొబ్బరి చిప్పలతో రకరకాల అందమైన వస్తువులను కూడా తయారు చేసుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే కొబ్బరి చిప్పలను పొయ్యి మంటేసుకోవడానికి అలాగే దిష్టి తగిలినప్పుడు దిష్టి తీయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
Also Read: Dandruff: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ హోం రెమెడీస్‌తో చెక్ పెట్టండిలా..!