HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Those Born On These Dates Have Great Silver Luck But What Should They Do

Numerology : ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకి వెండి భారీ అదృష్టం ! అయితే వీళ్లు ఏం చేయాలంటే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 16-11-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lucky Numbers
Lucky Numbers

బంగారం లేదా వెండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకప్పుడు వెండి పట్టీలు, మెట్టెలుగా మాత్రమే ధరించేవారు. నేడు పరిస్థితి పూర్తి భిన్నం. వెండి మంచి పెట్టుబడి ఆప్షన్‌గా కూడా మారింది. ఈ నేపథ్యంలో ఏ తేదీల్లో పుట్టిన వాళ్లకు సిల్వర్‌ లేదా వెండి అదృష్టాన్ని తీసుకొస్తుంది. వాళ్లు తమ అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి (Silver) చంద్రుడికి సంబంధించిన లోహం. చంద్రుడు (Moon) మనస్సు, ప్రశాంతత, అదృష్టం (Luck), శ్రేయస్సు వంటి వాటికి కారకుడు. అయితే న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదిని బట్టి ఏ తేదీలో పుట్టిన వాళ్లు ఎలాంటి లోహం ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందో పండితులు చెబుతారు. ఆయా పుట్టిన తేదీల ప్రకారం సంబంధిత లోహాన్ని ధరించడం వల్ల జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఈ నేపథ్యంలో పండితుల సలహా మీ పుట్టిన తేదీని ప్రకారం బంగారం, వెండి, రాగి తదితర లోహాల్లో ఏ లోహం చేసిన నగలు ధరిస్తే జీవితం ఆనందంగా, సౌకర్యంగా ఉంటుందో.. అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం..

న్యూమరాలజీ ప్రకారం 2, 10, 20, 29 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 2. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారికి వెండి అత్యంత అదృష్టమైన లోహంగా పరిగణించబడుతుంది. వీళ్లు వెండిని ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా స్పష్టత ఉంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వీళ్లు అదృష్టాన్ని మరింత పెంచుకోవాలంటే వెండి ఉంగరాన్ని కుడి చేతి చిటికెన వేలికి ధరించడం చాలా శుభప్రదం. వెండి గొలుసు ధరించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతి సోమవారం శివుడిని పాలతో అభిషేకం చేయడం లేదా చంద్రుడిని ధ్యానించడం, సోమవారం లేదా పౌర్ణమి రోజు తెలుపు రంగు వస్త్రాలు, బియ్యం, పంచదార వంటివి దానం చేయడం మంచిది.

న్యూమరాలజీ ప్రకారం 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 4. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. వీళ్లు సాధారణంగా గోమేధికం ధరించాలని పండితులు సూచిస్తుంటారు. అయితే ఈ రత్నాన్ని వెండితో కలిపి ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. చంద్రుడు శాంతి, స్థిరత్వానికి ప్రతీక. కాబట్టి రాహువు యొక్క అస్థిర ప్రభావాన్ని తగ్గించడానికి వెండి పరోక్షంగా సహాయపడుతుందట. అయితే వీళ్లు అదృష్టాన్ని పెంచుకోవడానికి ప్రతి శనివారం ఆంజనేయస్వామిని లేదా కాలభైరవుడిని పూజించాలి. శనివారం రోజు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల కూడా శుభఫలితాలు ఉంటాయి.

న్యూమరాలజీ ప్రకారం 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడికి సాధారణంగా వజ్రం (Diamond) లేదా రాగి (Copper) లోహం అదృష్టాన్ని తీసుకొస్తుంది. అయితే శుక్రుడుకి చంద్రుడు స్నేహితుడని జ్యోతిష్య పండితులు చెబుతారు. కాబట్టి వెండి ఆభరణాలు ధరించడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అయితే ఇది ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇది అత్యంత అదృష్టకరమైన లోహం మాత్రం కాదు. అయితే వీళ్లు అదృష్టాన్ని పెంచుకోవడం కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. అలాగే పటిక బెల్లం, స్వీట్లు దానం చేయడం కూడా శుభఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహాన్ని పెంచుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • Lucky Numbers
  • Numerology
  • silver

Related News

Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price : భారీగా పడిపోయిన బంగారం ధరలు

కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధర కూడా కేజీకి రూ.10,000 తగ్గి రూ.2.65 లక్షలకు చేరుకోవడం బులియన్ మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర ఒత్తిడిని సూచిస్తోంది

    Latest News

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

    • Bhadrachalam Temple : భద్రాచలం ఆలయ రూపురేఖలు మారబోతున్నాయా..?

    • Petrol Shortage : పెట్రోల్ కొరత…వాహనదారులు ఇలా చేస్తే పెట్రోల్ ఎంతో ఆదా !!

    • Fire Accident: మార్కాపురంలో ట్రావెల్ బస్సు ప్రమాదం .. 10 మంది సజీవ దహనం

    Trending News

      • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

      • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

      • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

      • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

      • పంజాబ్ ఆట‌గాళ్ల‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd