Food Habits : పరిగడుపున తీసుకోవాల్సినవి, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇవే?
టైం టు టైం సరిగా భోజనం చేయక భోజనం (Food) చేసినప్పుడు కూడా సరైన ఆహార పదార్థాలు తీసుకోక చాలా మంది అనారోగ్య సమస్యల పాలవుతున్నారు.
- Author : Naresh Kumar
Date : 21-11-2023 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
Daily Food Habits : ప్రస్తుత రోజుల్లో మానవ జీవనశైలి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనుషులు కంటినిండా నిద్రపోవడం లేదు. సరైన ఆహారం (Food) కూడా తీసుకోవడం లేదు. దీనితో చాలామంది చిన్న వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. టైం టు టైం సరిగా భోజనం (Food) చేయక భోజనం చేసినప్పుడు కూడా సరైన ఆహార పదార్థాలు తీసుకోక చాలా మంది అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. అయితే చాలామంది ఉదయం పరగడుపున తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి.
We’re Now on WhatsApp. Click to Join.
అయితే మరి పరగడుపున ఎటువంటి ఆహారం (Food) తీసుకోవాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. నిద్ర లేవగానే వెంటనే బ్రష్ కూడా చేయకుండా కాఫీ తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. అలా ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం వల్ల చాతిలో మంట డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పరగడుపున నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చల్ల నీటిని అస్సలు తాగకూడదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు మొదలవుతాయి. ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. పరిగడుపున లేచిన వెంటనే మద్యం తాగడం మరి హానికరం.
ఇది నేరుగా లివర్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. క్రమంగా మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి ఎన్నో అనారోగ్య సమస్యలకి కారణం అవుతుంది. అలాగే కొంతమంది మసాలా పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటారు. అయితే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటి వలన కడుపులో ఆసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ కొట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం వాటిల్లుతుంది. దాని ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్థాలను తీసుకోవాలి. పరిగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది.
Also Read: Cloud Laptop: రిలయన్స్ జియో నుంచి మరో ల్యాప్‌టాప్.. ధర రూ.15,000 మాత్రమే..?