Ice Apples: తాటి ముంజ.. తింటే భలే మజా!
సమ్మర్ సీజన్ మొదలైంది... భానుడు భగభగలు, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
- Author : Balu J
Date : 05-04-2022 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
సమ్మర్ సీజన్ మొదలైంది… భానుడు భగభగలు, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమ్మర్ స్ట్రోక్స్ నుంచి తప్పించుకునేందుకు శీతల పానియాల వైపు ద్రుష్టి సారిస్తున్నారు. తెలంగాణలో చాలా చోట్లా సహజంగా దొరికే ఐస్ యాపిల్స్ (తాటి ముంజలు)తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తాటి ముంజలను రెగ్యులర్ గా తినడం వల్ల వడదెబ్బతో పాటు ఎండ వేడిమి నుంచి తప్పించుకోవచ్చు. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
శరీరంలోని వ్యర్థాలన్నింటిని కూడా ముంజలు బయటకు పంపేస్తాయి. మలబద్దకాన్ని తరమికొడతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. శరీరాన్ని చల్లపరిచే గుణం ఉండంటంతో జనాలు వీటిని తినేందుకు యమ ఇష్టం చూపిస్తారు. మొటిమలు తగ్గించడానికి, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు నిర్మూలనలో కూడా ముంజలు చాలా హెల్ప్ చేస్తాయి. గర్భిణులకు మంచి బలాన్ని ఇస్తాయి. మలబద్ధక సమస్యను నివారించడంలో తాటి ముంజలు బాగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అందం పరంగా కూడా ముంజలు బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి.
మండు వేసవిలో ఈ సీజనల్ ఫ్రూట్ ని తింటే వేసవి తాపానికి చెక్ పెట్టవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సహజ సిద్ధమైన ముంజలతో ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం.. ఒక్క తాటి ముంజలోఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాదు శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి చల్లదనాన్ని అందిస్తుంది.