Onions For Skin: మొటిమలు,జుట్టు సమస్యలు దూరం కావాలంటే ఉల్లితో ఇలా చేయాల్సిందే?
మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామర్థ్యం మనం వినే ఉంటుంది. అది నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ కేవలం ఆరోగ్యానికి మాత
- Author : Anshu
Date : 24-07-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామర్థ్యం మనం వినే ఉంటుంది. అది నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కూరల్లో ఉల్లిపాయ లేకపోతే టేస్ట్ ఉండదు. ఉల్లిపాయను పచ్చిగా తినవచ్చు,లేదంటే కూరల్లో వేసుకుని కూడా తినవచ్చు. ఉల్లి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఎర్ర ఉల్లిపాయలు శరీరంలో మంచి కొవ్వు నిల్వ ఉంచేందుకు తోడ్పడతాయి. ఉల్లిలో సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. ఉల్లిపాయ ముఖంపై నల్లటి మచ్చలు, జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ముఖంపై మొటిమలు, మచ్చలు పోవాలంటేఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉల్లి రసం, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి. అనంతరం దాన్ని ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉల్లిపాయను రోజూ ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. షుగర్‌తో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఇన్సూలిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యకు కూడా ఉల్లి ఔషధంలా పని చేస్తుంది. ఉల్లిపాయను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం వేళలో ఆహారంగా తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి.
ఇందులోని క్రోమియం కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లి ఉపకరిస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్లను అరికడుతుంది. తరచూ ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు కుదుళ్ళు గట్టిపడి హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఉల్లిపాయను ఉపయోగించడం మంచిదే కానీ అలా అని ఎలా పడితే అలా ఉపయోగించకుండా సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా అందం కోసం ఉల్లిపాయలు ఉపయోగించేవారు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.