Diabetes: మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆకులు తినాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో షుగర్ వ్యాధి ఒకటి. దీనినే డయాబెటిస్ లేదా
- By Anshu Published Date - 07:30 AM, Wed - 23 November 22

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో షుగర్ వ్యాధి ఒకటి. దీనినే డయాబెటిస్ లేదా మధుమేహం అని కూడా పిలుస్తూ ఉంటారు. మధుమేహం సమస్య చిన్న వయసు వారి నుంచి ముసలివారి వరకు చాలామందిని వేధిస్తోంది. డయాబెటిస్ పేషెంట్లు ఆహార విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోయి ప్రాణాల మీదకు వస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆకుపచ్చని ఆకులు మధుమేహాన్ని నియంత్రించడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామంది భోజనం చేసేటప్పుడు కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ కరివేపాకు వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కరివేపాకు డయాబెటిస్ పేషెంట్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి కరివేపాకును డయాబెటిస్ పేషెంట్లు తప్పకుండా తినాలి. వేప ఆకులను చాలామంది తినడానికి ఇష్టపడరు. మరి కొంతమంది మాత్రం వేప ఆకులను ఈజీగా నమిలేస్తూ ఉంటారు. వేప ఆకుల్లో ఉండే ఆంటీ డయాబెటిస్ లక్షణాలు చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు కొన్ని పచ్చి వేప ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అలాగే పుదీనా ఆకులు కూడా డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా పనిచేస్తాయి. పుదీనా ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. తులసి ఆకుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ తులసి ఆకులను డయాబెటిస్ పేషెంట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తులసి ఆకులను తింటూ ఉండటం వల్ల డయాబెటిస్ సమస్య తగ్గడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆలివ్ ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉండడంతో పాటుగా ఇవి శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.