HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Runners Are At Risk Of Heart Attack These Are The Signs

Heart Attack risk for Runners: రన్నర్లకు గుండెపోటు ముప్పు..

రన్నింగ్ (Running) ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. రోజూ 30 నిమిషాల పరుగు

  • Author : Maheswara Rao Nadella Date : 16-02-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Runners Are At Risk Of Heart Attack.. These Are The Signs
Runners Are At Risk Of Heart Attack.. These Are The Signs

రన్నింగ్ ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. రోజూ 30 నిమిషాల పరుగు మన బాడీ నుంచి 396 క్యాలరీలని కరిగిస్తుంది. రన్నింగ్ వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. అయితే రన్నింగ్ చేస్తూ కొందరు గుండెపోటుకు (Heart Attack) గురయ్యారనే వార్తలను మనం ఇటీవల కాలంలో చాలా విన్నాం. రన్నింగ్ చేసే క్రమంలో గుండెపోటు (Heart Attack) వచ్చే సంకేతాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రన్నింగ్ చేసేటప్పుడు గుండెపోటు (Heart Attack) సంకేతాలు

  1. ఛాతీ నొప్పి
  2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  3. విపరీతమైన చెమటలు
  4. దడ
  5. తలతిరగడం
  6. ఛాతీ మధ్య భాగంలోని కండరాలలో అసౌకర్యం
  7. ఎడమ లేదా కుడి చేయిలో నొప్పి

మహిళల్లో గుండెపోటు (Heart Attack) సంకేతాలు

  1. అలసట
  2. శ్వాస ఆడకపోవడం
  3. దవడ, మెడ నొప్పులు
  4. వెన్ను ఎగువ భాగంలో నొప్పి
  5. ఛాతీ దిగువ భాగంలో ఒత్తిడి

రన్నింగ్ చేస్తారా.. ఈ టిప్స్ ఫాలో కండి

  1. పాత రన్నింగ్ షూస్ వేసుకోవద్దు.మీ పాదాల ఆకృతిని బట్టీ మీ రన్నింగ్ స్టైల్ ని బట్టీ షూస్ తీసుకోండి. ప్రతి 350 మైళ్ళ పరుగుకీ షూస్ మార్చేస్తూ ఉండండి. లేదంటే కుషన్ అరిగిపోవడం వల్ల గాయాలయ్యే రిస్క్ ఉంది. రన్నింగ్ చేసి వచ్చిన తరువాత వాటిని గాలికి ఆరబెడితే ఎక్కువ కాలం మన్నుతాయి.
  2. ఎక్సైట్మెంట్ లో మరీ స్పీడ్ గా.. మరీ ఎక్కువ దూరం రన్నింగ్ చేయొద్దు. మీ మైలేజ్ ని గ్రాడ్యువల్ గా పెంచుకోండి.
  3. మీరు రన్నింగ్ కి కొత్త అయినా, లేదా లాంగ్ బ్రేక్ తరువాత మళ్ళీ రన్నింగ్ కి వస్తున్నా ముందు వాకింగ్ తో మొదలు పెట్టండి. మెల్లగా రన్నింగ్ లోకి రండి.
  4. బాడీ పెయిన్స్ మీద దృష్టి పెట్టండి. మీరు పరిగెడుతున్నప్పుడు నొప్పి ఎక్కువయితే రన్నింగ్ ఆపాలి.
  5. వారం లో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా రెస్ట్ తీసుకోండి.ఎందుకంటే ఈ రెస్ట్ డేస్ లోనే బాడీ తనని తాను రిపెయిర్ చేసుకుంటుంది.
  6. పెద్ద పెద్ద స్టెప్స్ తో రన్నింగ్ చేయొద్దు.
  7. కొంత మంది పరిగెత్తేప్పుడు చేతుల్ని అటూ ఇటూ స్వింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సరిగా ఊపిరి తీసుకోలేరు.
  8. పరిగెత్తుతున్నప్పుడు ఎంత నీరు కోల్పోతారో కొంత మందికి సరైన అంచనా ఉండదు. దాంతో తగినంత నీరు తాగరు. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్యని ఎదుర్కొంటారు.
  9. రన్నింగ్ చేయడానికి గంట ముందు అర లీటరు నుండి ముప్పావు లీటరు నీరు తాగండి. కావాలనుకుంటే రన్నింగ్ కి జస్ట్ ముందు ఒక గ్లాసు నీరు తాగవచ్చు.
  10. ప్రతి ఇరవై నిమిషాల పరుగుకీ సుమారుగా ఒక గ్లాసు నీరు తీసుకోవచ్చు. అలాగే, రన్నింగ్ చేసిన తరువాత కూడా నీరు తాగాలి.
  11. మీ యూరిన్ పసుపు పచ్చగా ఉందంటే మీరు తగినంత నీరు తాగడం లేదని అర్ధం.
  12. రన్నింగ్ చేసేటప్పుడు చెమట పీల్చే బట్టలు వేసుకోవడం ముఖ్యం. అలాగని కాటన్ వేసుకుంటే అవి చెమట పీల్చిన తరువాత తడిగా ఉండిపోతాయి. టెక్నికల్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటప్పుడు బాగా సరిపోతాయి.
  13. రన్నింగ్ చేసేప్పుడు సరిగా ఊపిరి తీసుకోకపోతే కష్టం. తేలికగా ఊపిరి తీసుకుంటే పక్కలు నొప్పి పెడతాయి. మీరు రన్నింగ్ చేసేప్పుడు మీరు ముక్కు ద్వారా నోటి ద్వారా కూడా గాలి పీల్చాలి. పరిగెత్తడానికి మీ మజిల్స్ కి ఆక్సిజెన్ కావాలి. అంత ఆక్సిజెన్ కేవలం ముక్కు ద్వారా మాత్రమే గాలి పీల్చడం వల్ల రాదు.
  14. అలాగే, పొట్ట దగ్గర నుండి ఊపిరి తీసుకోవాలి, ఛాతీ వద్ద నుండి కాదు. శ్వాస వదిలేప్పుడు నోటి ద్వారా వదలాలి, పూర్తిగా వదలాలి. ఇలా చేస్తేనే మీరు ఎక్కువ గాలి లోపలికి పీల్చుకోగలుగుతారు.
  15. రన్నింగ్ చేయడానికి గంటన్నర, రెండు గంటల ముందు లైట్ గా స్నాక్ ఏదైనా తీసుకోండి. కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉండే స్నాక్ ఎంచుకోండి. అరటి పండు, బేగెల్ తో పీనట్ బటర్, పాలతో కోల్డ్ సిరియల్ వంటివి కొన్ని ఆప్షన్స్.
  16. వర్కౌట్ తరువాత ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా ఏదైనా ఆహారం తీసుకోండి. మూడు గ్రాముల కార్బ్స్ కి ఒక గ్రాం ప్రొటీన్ ఉండేలా మీ పోస్ట్ వర్కౌట్ స్నాక్ ఉండాలి. ఫ్రూట్ ఎండ్ యోగర్ట్ స్మూతీ, పీనట్ బటర్ ఎండ్ జెల్లీ శాండ్విచ్, చాకొలేట్ మిల్క్ వంటివి కొన్ని ఆప్షన్స్.

గుండెపోటు (Heart Attack) ప్రమాద కారకాలు

  1. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం
  2. పొగాకును ఏ రూపంలోనైనా తీసుకోవడం
  3. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ LDL 100 కంటే ఎక్కువ ఉండటం
  4. అధిక రక్తపోటు (హైబీపీ) 140/90 కంటే ఎక్కువ ఉండటం
  5. ఊబకాయం
  6. వ్యాయామానికి దూరంగా ఉండటం, ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం
  7. డిప్రెషన్
  8. నిద్ర లేకపోవడం

గుండె ఆరోగ్యం పెంచే ఫ్రూట్స్ ఇవే

  1. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ తినవచ్చు. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.ఇవి గుండెపోటు ముప్పును తగ్గిస్తాయి.
  2. అవకాడోలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవోకాడోలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
  3. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
  4. నారింజ పండు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  5. ద్రాక్షలో పాలీఫెనాల్స్ , ఫినోలిక్ యాసిడ్‌లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫ్లాట్‌లెట్ గుణాలు గుండెను ఆరోగ్యవంతం చేస్తాయి.

Also Read:  Maharashtra: మహారాష్ట్రలో భూమి నుండి వింత వింత శబ్దాలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • food
  • Habits
  • health
  • heart
  • heart attack
  • Life Style
  • Runners
  • tips
  • Tricks

Related News

Here is how you can tell if someone truly loves you!

True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

True Love: ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టే లేదా మీకు నచ్చనిది ఏమీ చేయరు. నిజమైన ప్రేమగల (True Love) వ్యక్తి మీ కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెతుకుతాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటిక

  • 7 Tips to Curb Insomnia for Stress Management

    Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd