Onion Peel : ఇమ్యునిటీ పెంచే ఈ సింపుల్ చిట్కా మీకు తెలుసా..?
Onion Peel ఆరోగ్యకరమైన మనిషికి వ్యాధుల నుంచి తనని తాను కాపాడుకునేందుకు ఇమ్యునిటీ బాగా ఉపయోగపడుతుంది. వ్యాధుల
- Author : Ramesh
Date : 21-09-2023 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
Onion Peel ఆరోగ్యకరమైన మనిషికి వ్యాధుల నుంచి తనని తాను కాపాడుకునేందుకు ఇమ్యునిటీ బాగా ఉపయోగపడుతుంది. వ్యాధుల బారిన పడకుండా మనిషిలో ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏం చేసినా సరే ఎలా చేసినా సరే ఇమ్యునిటీ పెంచుకునేందుకు ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇమ్యునిటీ పెంచుకునేందుకు ఏవేవో అధిక ధరల్లో వాటిని ప్రయత్నిస్తుంటారు.
కానీ మనం వేస్ట్ అనుకున్న వాటిల్లోంచి మనకు కావాల్సినంత ఇమ్యునిటీ దొరుకుతుందని తెలిస్తే ఎలా ఉంటుంది. మనం నిత్యం వండుకునే కూరగాయల తొక్కల్లోనే బెస్ట్ ఇమ్యునిటీ ఇచ్చే పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కోడిగుడ్డు పెంకుల్లో, ఉల్లిపాయ తొక్కలో అన్నీ ఇమ్యునిటీ పెంచుకునేందుకు పనికొస్తాయి. ఉల్లిపాయల తొక్కలను తీసి డస్ట్ బిన్ లో వేస్తారు. కొందరు ఇళ్లల్లో గులాబి మొక్కలకు వాటిని వేస్తుంటారు. కానీ ఉల్లి పాయల్లోనే కాదు వాటి తొక్కల్లో కూడా పోషకాలు ఉంటాయని తెలుస్తుంది. సరైన విధంగా వాడుకుంటే ఉల్లి పాయల తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని అంటున్నారు.
ఉల్లిపాయ తొక్కలు (Onion Peel ) ఇన్ ఫ్యూడ్ వెనిగర్ తయారు చేసేందుకు ఉపయోగించొచ్చు.. వెనిగర్ ఉన్న బాటి లో ఉల్లిపాయ తొక్కలు వేసి మూత పెట్టాలి. అలా కొన్ని వారాల పాటు దాన్ని అలానే ఉంచితే ఈ వెనిగర్ సలాడ్ డ్రెస్సింగ్, మెర్నేడ్ గా వాడుకోవచ్చు. ఉల్లి పాయ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఉల్లిపాయ తొక్కల్ని వేడి నీటిలో మరిగించి ఆ తర్వాత వడకట్టి తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ ఫెక్షన్స్ ఉన్న వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ తొక్కల్లో ఉండే సపోనిన్ కంటెంట్ చూర్ణంలా నీటితో కలిస్తే పాత్రలు శుభం చేసుకునేందుకు ఉపయోగించవచ్చు.
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఉల్లిపాయ తొక్కని వాడతారు. ఉల్లి తొక్క కషాయాన్ని హెయిర్ రిన్స్ గా వాడుకుంటే తొక్కలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుతు పరచడమే కాకుండా జుట్టు మెరిసేందుకు సహాయపడతాయి. ఉల్లి తొక్కలను పొడిగా చేసుకుని కలబంద యాడ్ చేసి హెయిర్ డై గా కూడా వాడుకోవచ్చు. సో ఉల్లి తొక్కల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిసింది కదా ఈసారి వాటిని కట్ చేసినప్పుడు వేస్ట్ చేయకుండా మీ వంటికి వాడుకుంటే బెటర్.
Also Read : Prabhas Salaar : సలార్ సంక్రాంతికి వస్తాడా..?