HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Onion Juice For Dandruff Onion Juice For Healthy Long Hair

Onion Juice: ఈ ఒక్క జ్యూస్ తో మీ జుట్టు సమస్యలు తగ్గి, గడ్డిలా గుబురు లాగా పెరగడం ఖాయం!

ఉల్లిపాయ రసం ఉపయోగించడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయట.

  • Author : Anshu Date : 04-02-2025 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Onion Juice
Onion Juice

ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఉల్లిని డైట్ లో భాగం చేసుకోమని చెబుతూ ఉంటారు. కాగా ఉల్లి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఉల్లి రసం జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంతో పాటు జుట్టు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉల్లి రసం ఉపయోగించవచ్చట. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడడం కోసం ఉల్లిపాయ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.

జుట్టు చిట్లిపోయి పొడిగా ఉన్నట్లయితే ఉల్లి నూనెను చుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఉల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టుకు ఉల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు మరింత మెరుస్తూ, మృదువుగా మారుతుంది. షాంపూ చేయడానికి ముందు ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే తలకు రక్త ప్రసరణ పెరిగి జుట్టు రాలడాన్ని నివారిస్తుందట. జుట్టును ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు జుట్టుకు ఉల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును నల్లగా మారుస్తాయట.

అయితే ముందుగా ఉల్లిపాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. తర్వాత రసాన్ని వేరు చేయాలి. ఇందులో కొబ్బరి నూనె కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత జుట్టుకు బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ విధంగా చేస్తే బాగా పొడవుగా పెరుగుతుందట. ఉల్లి నూనెను ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ రెమిడీ నీ వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. మార్పుని మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hair tips
  • health tips
  • onion juice
  • Onion Juice benefits

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

    • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

    • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

    • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

    • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd