Happy Friendship Day : స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణుడు – సుదాముడి స్నేహగాథ తెలుసుకోవాలంతా!
స్నేహ దినోత్సవం సందర్భంగా ఈ అమర మైత్రి కథను గుర్తుచేసుకోవడం తగిన విధమే. శ్రీకృష్ణుడు, సుదాముడు ఇద్దరూ బాల్యంలో గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. విద్య పూర్తయిన తరువాత వారు తమ తమ ఇళ్లకు వెళ్ళారు. కాలక్రమేణా శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడిగా రాజ్యాన్ని పాలించగా, సుదాముడు మాత్రం బ్రాహ్మణునిగా వేదాధ్యయనంతో జీవనం సాగించాడు.
- By Latha Suma Published Date - 08:27 AM, Sun - 3 August 25

Happy Friendship Day : స్నేహం అంటే ఏమిటో, నిజమైన మిత్రుడి లక్షణాలు ఎలా ఉండాలో మన పురాణాలు ఎన్నో సందర్భాల్లో వివరిస్తాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది శ్రీకృష్ణుడు – సుదాముడి స్నేహగాథ. ఈ కథ ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని తరాలైనా మానవ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్నేహ దినోత్సవం సందర్భంగా ఈ అమర మైత్రి కథను గుర్తుచేసుకోవడం తగిన విధమే. శ్రీకృష్ణుడు, సుదాముడు ఇద్దరూ బాల్యంలో గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. విద్య పూర్తయిన తరువాత వారు తమ తమ ఇళ్లకు వెళ్ళారు. కాలక్రమేణా శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడిగా రాజ్యాన్ని పాలించగా, సుదాముడు మాత్రం బ్రాహ్మణునిగా వేదాధ్యయనంతో జీవనం సాగించాడు. అతను ఎంతో నిరుపేదగా ఉండేవాడు. అన్నం తినడానికి కూడా కష్టపడే పరిస్థితిలో ఉండేవాడు.
Read Also: Diabetes Control: డయాబెటిస్ ఉన్నవారు ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్!
ఆ పరిస్థితుల్లో సుదాముని భార్య ఒకసారి కంటతడి పెట్టుతూ ఇలా అంటుంది. నీ స్నేహితుడు కృష్ణుడు ఇప్పుడు రాజు అయ్యాడు. ఆయనను కలిసివెళ్ళు. మన జీవితాన్ని మార్చుకోగలవు కానీ నిజమైన స్నేహితుడిని కలిసి ఏదైనా అడగడం సుదాముని మనసుకు రాలేదు. అయినా భార్య వేదనను గుర్తించి, ఒక మూటి అటుకులు చేతబట్టి, ద్వారకకు బయలుదేరాడు. ద్వారక నగరానికి చేరుకున్న సుదాముడిని చూసి అక్కడున్న రక్షకులు అణగారిన రూపాన్ని చూస్తే ఆశ్చర్యపోయారు. కానీ కృష్ణుడు తన మిత్రుడు వచ్చాడని విన్న వెంటనే అర్థం చేసుకోలేని ఆనందంతో చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ద్వారంలోనే సుదాముడిని ఆలింగనం చేసుకుని, అతని పాదాలు స్వయంగా కడిగి, అత్యంత గౌరవంతో అతిథిగా ఆహ్వానించాడు.
అంతటి వైభోగ రాజ్యంలోకి అడుగుపెట్టిన సుదాముడికి తన అటుకుల మూట చూపించడమే అసౌకర్యంగా అనిపించింది. కానీ కృష్ణుడు ప్రశ్నించాడు మిత్రమా, నాకోసం ఏమి తెచ్చావు? సుదాముడు విసిగిపోయినా, కృష్ణుడు చేతిలో నుండి ఆ మూట తీసుకుని ప్రేమతో అందులోని అటుకులను తినడం ప్రారంభించాడు. కన్నయ్య మొదటి గుప్పెడు తినగానే సుదాముడి ఇంట్లో మార్పులు ప్రారంభమయ్యాయి. పేదరికం కదిలిపోయింది, ఐశ్వర్యం ఉరకలెత్తింది. రెండో గుప్పెడు తినగానే ఆ ఇంటి కోణాల్లో సంపద పారిపోయింది. మూడో గుప్పెడు తీసుకునే సమయంలో రుక్మిణి కృష్ణుడిని ఆపేస్తుంది. అందరికీ అర్ధం కాక తలలు తిప్పగా, ఆమె సమాధానం అద్భుతంగా ఉంటుంది. ప్రభూ, మీరు రెండు గుప్పెడు తినగానే రెండు లోకాలను దానం చేసారు. మూడోది తింటే మిగతా జనులు ఎక్కడికి వెళ్తారు?. ఆ సుదాముడు నిండైన గౌరవంతో, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన తాండ్రతో తిరిగి ఇంటికి చేరాడు. స్నేహం అంటే ఒకరి స్థితిని చూడకుండా, మనసును అర్థం చేసుకుని సహాయం చేయడం. ప్రేమ, గౌరవం, త్యాగం అన్నీ కలిసిన నిష్కల్మషమైన ఈ మైత్రి ఆధునిక సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ స్నేహ దినోత్సవం నాడు మనం కూడా శ్రీకృష్ణుడు – సుదాముడిలా స్నేహాన్ని గౌరవిద్దాం. అవసరంలో తోడుగా నిలబడే మిత్రులుగా మారుదాం. ఎందుకంటే, నిజమైన స్నేహితుడు జీవితాన్ని మార్చగల శక్తి కలవాడు.