Nellore Chepala Pulusu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు!
నాన్ వెజ్ ప్రియులు చాలామంది ఇష్టపడే వాటిలో చేపల పులుసు కూడా ఒకటి. ఈ చేపల పులుసును ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అయితే
- By Anshu Published Date - 09:30 PM, Sun - 28 January 24
నాన్ వెజ్ ప్రియులు చాలామంది ఇష్టపడే వాటిలో చేపల పులుసు కూడా ఒకటి. ఈ చేపల పులుసును ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నెల్లూరు చేపల పులుసు. మరి ఈ నెల్లూరు చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నెల్లూరు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు :
చేపలు – 1 కేజీ
చింతపండు – 50 గ్రాములు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 4
పుల్లమామిడికాయ – 1
టమాటా – 1
మెంతులు – అర టీస్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
ధనియాలు – 2 టీస్పూన్లు
ఆవాలు – అర టీస్పూన్
నూనె – 4 టేబుల్ స్పూన్లు
మెంతులు – పావు టీస్పూన్
ఆవాలు – పావు టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
కరివేపాకు – కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
కారం – 3 టీ స్పూన్లు
ఉప్పు – సరిపడా
కొత్తిమీర – కొద్దిగా
నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా చేపల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేయించుకొని వాటిని బాగా కడిగి చేప ముక్కలపై 2 టీస్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వెయ్యాలి. చిటికెడు పసుపు వెయ్యాలి. ఈ మాసాలా అన్ని చేప ముక్కలకూ బాగా అంటుకునేలా బాగా కలపాలి. ముక్కలకు మసాలా అంటించిన చేప ముక్కలు ఇలా ఉంటాయి. దీని వల్ల ఉప్పు, కారం అన్ని ముక్కలూ పీల్చుకుంటాయి. టేస్ట్ అదిరిపోతుంది. వీటిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా నీటిలో గుజ్జులా చేసి నానబెట్టండి. 10 నిమిషాల్లో చింతపండు నానిన తర్వాత గుజ్జు తీసేసి నీటిని రెడీగా ఉంచుకోవాలి. 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసి ఉంచుకోండి. 4 పచ్చిమిర్చిని నిలువుగా కోసుకోవాలి. ఒక పుల్ల మామిడిని, టమాటాను కూడా పీసెస్చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మెంతులు అరటీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, ధనియాలు 2 టీస్పూన్లు, ఆవాలు అర టీస్పూన్ వేయాలి. వాటిని చిన్న మంటపై వేపి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అవి కొద్దిగా చల్లారా వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వెయ్యాలి. నూనె వేడెక్కాక మెంతులు పావు టీస్పూన్, ఆవాలు పావు టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చెయ్యండి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలి. దోరగా ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీస్పూన్ వెయ్యాలి. బాగా వేగాక, మామిడి ముక్కలు, టమాటా ముక్కలు వెయ్యండి. అవి కాస్త మెత్తగా అయ్యాక, పసుపు పావు టీస్పూన్, కారం 3 టీస్పూన్లు, ఉప్పు సరిపడా వెయ్యాలి. ఆల్రెడీ మొదట్లో ముక్కలకు ఉప్పు వేశాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పడు సరిపడా వేసుకోవాలి. పొడిగా చేసుకున్న ధనియాల పొడిని వేసి బాగా కలుపుకొని తర్వాత చింతపండు రసం వేయాలి. తర్వాత కావాల్సిందిగా నీరు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలను వేసుకుని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ.