Kobbari Burelu: సంక్రాంతి స్పెషల్ వంటకం.. కొబ్బరి బూరెలు సింపుల్ గా ట్రై చేయండిలా?
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రకరకాల పిండి వంటలు ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్ల కోసం ఎక్కువగా తీపి వంటకా
- By Nakshatra Published Date - 05:00 PM, Thu - 11 January 24
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రకరకాల పిండి వంటలు ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్ల కోసం ఎక్కువగా తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో కొబ్బరి బూరెలు కూడా ఒకటి. ఈ కొబ్బరి బూరెలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి బూరెలు తయారీ విధానం:
మినపపప్పు – 1 కప్పు
బియ్యం పిండి – 2కప్పులు
ఉప్పు – తగినంత
బెల్లం తురుము – 1 కప్పు
పచ్చికొబ్బరి తురుము – 3 కప్పులు
జీడిపప్పు పలుకులు – పిడికెడు
యాలకుల పొడి – అర టీస్పూన్
నూనె – డీ ఫ్రైకు సరిపడా
కొబ్బరి బూరెలు తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా ఒక జార్ తీసుకొని అందులో మినపపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లించి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో బియ్యం పిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. ఈ పిండిపై మూతపెట్టి గంటపాటు నాననివ్వాలి. తర్వాత ఒక కడాయిలో బెల్లం, కొబ్బరి తురుము వేసి కలుపుతూ వేడిచేసుకోవాలి. ఇలా 15నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు అలాగే వేడి పై కలిపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో రెండు టీ స్పూన్ల బియ్యం పిండి వేసి కలిపి చల్లారనివ్వాలి. కొబ్బరి మిశ్రమం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన పిండిలో కొన్ని నీళ్లు పోసి పిండిని కావాల్సినంత పలుచగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెయ్యాక కొబ్బరి ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఇలా నూనెలో 4 లేదా 5 ఉండలను వేసుకుని మీడియం మంటలపై అటూ ఇటూ కలుపుతూ దోరగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ.
Tags
Related News
Beetroot Kobbari Koora: బీట్ రూట్ కొబ్బరి కూర.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ అవడం ఖాయం?
మామూలుగా మనం బీట్రూట్ తో రకరకాల రెసిపీలు తినే ఉంటాం. బీట్రూట్ ఫ్రై, బీట్రూట్ రైస్, బీట్రూట్ పులావ్, బీట్రూట్ హల్వా అలాంటి రెసిపీలను తినే ఉ