Increase Weight: సన్నగా ఉన్నానని బాధపడుతున్నారా.. ఈ పని చేస్తే ఈజీగా బరువు పెరగొచ్చు!
ప్రస్తుతం చాలామంది లావుగా ఉన్నాము అని బాధపడుతుంటే మరి కొంత మంది మాత్రం సన్నగా ఉన్నాము అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఎంత తిన్నా కూడా లావు అవ్వడం లేదు ఏదైనా లోపం ఉందా అని భయపడుతూ ఉంటారు.
- Author : Anshu
Date : 11-10-2022 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం చాలామంది లావుగా ఉన్నాము అని బాధపడుతుంటే మరి కొంత మంది మాత్రం సన్నగా ఉన్నాము అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఎంత తిన్నా కూడా లావు అవ్వడం లేదు ఏదైనా లోపం ఉందా అని భయపడుతూ ఉంటారు. అంతే కాకుండా వయసు ఎత్తుకు తగ్గట్టుగా బరువు లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది చాలామంది సన్నగా ఉన్నవారు బరువు పెరగడం కోసం ఫాస్ట్ ఫుడ్, అలాగే రకరకాల ఆహార పదార్థాలను తిన్న కూడా బరువు పెరగలేదు అని బాధపడుతూ ఉంటారు.
అయితే అలా సన్నగా ఉన్నాము అని బాధపడే వారు అరటిపండు తిని ఏ విధంగా బరువు పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లావు పెరగాలి అనుకున్న వారు ప్రతి రోజు ఒక మీడియం సైజులో ఉన్న అరటి పండును తినాలి. అయితే ఆ అరటి పండును ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినడం వల్ల అది మీ ఒంటికి కండ పడుతుంది. అలాగే కండరాల నిర్మాణం కూడా బాగా ఉంటుంది. కొంతమంది మరీ బక్క పల్చగా ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండును తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటుగా రోజంతా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు.
అరటి పండుని తినాలని అనిపించని వారు అరటి పండును షేక్ చేసుకుని లేదంటే పాలల్లో వేసుకుని తినవచ్చు. కానీ రాత్రి సమయంలో మాత్రం అరటిపండును తినకూడదు. రాత్రి సమయంలో అరటి పండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బరువు పెరగాలి అనుకున్న వారు అరటిపండును మధ్యాహ్నం సమయంలో తినవచ్చు. ఇందుకోసం అరటిపండు పెరుగును కలిపి తినండి. ఇలా తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో తినడం వల్ల తిన్న ఆహారం కూడా తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే అరటి తేనే బాదం పప్పులను కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందడంతో పాటు కండరాలు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా బరువు కూడా తొందరగా పెరుగుతారు.