HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >If You Eat These Foods In Winter It Will Keep You Warm Diseases Will Go Away

Health Tips: చలికాలంలో ఇవి తింటే వెచ్చగా ఉండడంతో పాటు.. ఆ సమస్యలకు కూడా చెక్?

చలికాలం మొదలయ్యింది. చలికాలంలో చాలామంది తెల్లవారినా కూడా ఇంట్లోంచి రావడానికి ఇష్టపడరు.

  • Author : Anshu Date : 19-11-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

చలికాలం మొదలయ్యింది. చలికాలంలో చాలామంది తెల్లవారినా కూడా ఇంట్లోంచి రావడానికి ఇష్టపడరు. చలికాలంలో వీచే చల్లటి గాలుల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో శరీరం మరింత చల్లగా ఉండటం వల్ల వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి చలికాలంలో తీసుకునే ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి ఎటువంటి ఆహార పదార్థాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. బెల్లం వేడి గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే బెల్లం తో తయారు చేసిన లడ్డు తినడం కూడా మంచిది. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలి అంటే బెల్లం టీ బెల్లం పాలు తాగాలి. అలాగే చలికాలంలో తేనెను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాధులతో పోరాడే శక్తిని మనకు ఇస్తుంది. కాబట్టి చలికాలంలో ప్రతిరోజు ఒక చెంచా తేనె తీసుకోవడం వల్ల జలుబు లాంటి సమస్యలు కూడా దరిచేరవు. అలాగే అల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

చలికాలంలో అల్లం టీ తాగడం వల్ల శరీరం మెదడు చురుకుగా ఉంటాయి. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చలికాలంలో ఎక్కువగా కూరగాయలతో తయారుచేసిన సూప్ లు తాగడం వల్ల శరీరం రెచ్చగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.ఎముకలు దృఢంగా మారడంతో పాటుగా కండరాలు కూడా చురుగ్గా ఉంటాయి. గుడ్డును తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. గుడ్డులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో ఉడికించిన కోడి గుడ్డు తినడం వల్ల ఎంతో మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • diseases
  • foods
  • health tips
  • winter

Related News

    Latest News

    • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

    • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

    • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

    • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

    • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

    Trending News

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd