Herbal Tea: ఉదయం ఈ టీ తాగితే… ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!!
- By hashtagu Published Date - 08:50 AM, Wed - 16 November 22

చాలామంది టీతోనే ఉదయాన్ని ప్రారంభిస్తారు. టీ లేదా కాఫీ తాగిన తర్వాతే..మిగతా పనుల్లో బిజీగా మారుతారు. ఎందుకంటే ఉదయాన్ని టీ తాగుతుంటే రోజంతా హుషారుగా ఉంటుందని నమ్మకం. కానీ టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది.. అయితే ఉదయం టీ కానీ కాఫీ బదులు, ఈ హెర్బల్ టీ తాగినట్లయితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో చూద్దాం.
1. హెర్బల్ టీ ప్రతిరోజూ తాగినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అంతేకాదు దీనితో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలనూ పొందవచ్చు. అయితే ఈ హెర్బల్ టీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టౌ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో గ్లాసున్నర నీళ్లు పోయాలి. అవి వేడిఅయ్యాక… ఒక స్పూన్ ధనియాలు, పది తాజా పుదీనా ఆకులు, రెండు బిర్యానీ ఆకులు వేయాలి. ఇఫ్పుడు ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మరగనివ్వాలి.
2. మరిగిన తర్వాత వాటిని వడకట్టాలి. ఆకుల్లోని పోషకాలన్నీ కూడా నీటిలో చేరుతాయి. ఈ నీటిని కాస్త గోరువెచ్చగా అయ్యాక తాగాలి. అంతే రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ హెర్బల్ టీ రెడీ అయ్యింది. అందులో ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఇంకా ఎన్నోప్రయోజనాలను పొందవచ్చు.
3. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం ఈ టీని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం, వంటి సమస్యలు తొలగిపోయాయి. కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. శీతాకాలంలో జలుబు, దగ్గు,గొంతు నొప్పి సమస్యలు రాకుండా ఉంచుతుంది. అంతేకాదు చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి దివ్యౌషదం అని చెప్పవచ్చు. అయితే షుగర్ ఉన్నవాళ్లు తేనెలేకుండా తాగినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.