Cough – Cold : చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి తగ్గడానికి.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..
చలికాలం(Winter) రాగానే ముందుగా పెద్దవారికైనా, పిల్లలకైనా తొందరగా జలుబు(Cold), దగ్గు(Cough) వంటివి వస్తుంటాయి.
- Author : News Desk
Date : 22-11-2023 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
చలికాలం(Winter) రాగానే ముందుగా పెద్దవారికైనా, పిల్లలకైనా తొందరగా జలుబు(Cold), దగ్గు(Cough) వంటివి వస్తుంటాయి. అయితే ఇవి తొందరగా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంటాయి. వీటిని తొందరగా తగ్గించుకోవడానికి మన వంటింట్లో ఉండే వాటితోనే తగ్గించుకోవచ్చు. ఇంగ్లీష్ మందుల కంటే కూడా వీటితో మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
* అల్లంతో చేసిన టీ లేదా కషాయం తాగడం వలన జలుబు, దగ్గు తొందరగా తగ్గుతాయి.
* దాల్చిన చెక్క, లవంగాలు, నిమ్మకాయతో చేసిన కషాయం తాగినా మంచి ఫలితం ఉంటుంది.
* తులసి ఆకులతో చేసిన టీ తాగడం వలన కూడా జలుబు, దగ్గు తగ్గుతాయి.
* కాచిన నీటిని తాగడం వలన మనలో రోగనిరోధక శక్తి పెరిగి మనకు తొందరగా జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి.
* శొంఠి పొడి, మిరియాల పొడి, తులసి ఆకులతో చేసిన పానీయం తాగడం వలన కూడా మనకు జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి.
* వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం వలన కూడా జలుబు, దగ్గు తగ్గుతాయి.
* పసుపు పాలు, మిరియాల పాలు తాగడం వలన మనలో రోగనిరోధకశక్తి పెరిగి ఇన్ఫెక్షన్లకు తొందరగా గురి కాకుండా ఉంటారు.
* వేడినీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వలన కూడా జలుబు, దగ్గు తగ్గుతాయి.
* మిరియాలు, తులసి కలిపి కాషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
* వెల్లుల్లిని చలికాలంలో మన ఆహారంలో భాగం చేసుకుంటే జలుబు వంటివి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ విధంగా ఇంటి చిట్కాలతోనే మనం చలికాలంలో జలుబు, దగ్గును ఇంటిలో ఉన్న పదార్థాలతోనే ఉపయోగించి తగ్గించుకోవచ్చు.