Oil Skin: వేసవిలో చర్మం జిడ్డుగా మారుతోందా.. ఈ సూపర్ చిట్కాలతో మెరిసే చర్మం మీ సొంతం!
వేసవి కాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Fri - 11 April 25

వేసవికాలం మొదలయ్యింది అంటే చాలు విపరీతమైన చెమట కారణంగా చర్మం జిడ్డుగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎండా కాలంలో అధికంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల మరింతగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చట. మరి వేసవిలో జిడ్డు చర్మం ఉండకూడదు అంటే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. కాగా బాగా మండే ఎండల్లో నుంచి నీడలోకి వచ్చిన తర్వాత చర్మం కమిలిపోయినట్లు కనిపించడం లేదా కాస్త మంటగా అనిపిస్తూ ఉంటుందట. దీంతో కొందరు చల్లని నీళ్లు ముఖం మీద చిలకరించుకుంటూ ఉంటారు.
అయితే దానికి బదులు క్లెన్సింగ్ మిల్క్ ని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందట. కొందరు ఎండాకాలంలో మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే కాలానికి అనుగుణంగా ఉత్పత్తులను ఎంచుకోవాలని చెబుతున్నారు. లేదంటే చర్మం ట్యాన్ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. స్నానం చేసిన అనంతరం లేదా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మేకప్ వేసుకోవడం సహజం అని చెబుతున్నారు. అయితే అందుకు ఉపయోగించే ఉత్పత్తులు కూడా జిడ్డుదనాన్ని ఎక్కువసేపు నివారించేలా ఉండాలట.
అప్పుడే మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుందట. లేదంటే మేకప్ వేసుకున్నా అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఎండాకాలం తీసుకునే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలట. నూనె పదార్థాలు అధికంగా తీసుకుంటే సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మేలని చెబుతున్నారు. అందుకోసం పండిన ఒక అరటిపండు తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులా రెండు చెంచాల ఓట్స్, చెంచా పాలు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 20 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చి, తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలట. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి అని చెబుతున్నారు. కీరాదోస రసం, నిమ్మరసం కొద్ది కొద్దిగా తీసుకుని బాగా కలపాలి. అందులో చిటికెడు పసుపు కూడా వేసి ఈ మిశ్రమాన్ని ఫేస్ కి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల సేపు ఆరిన తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ ను శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల ఫేస్ తాజాగా కనిపిస్తుందట.