Glass Items : మీకు తెలుసా.. గాజు పాత్రలను ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతాయి..!
Glass Items ఒకప్పుడు ఇంట్లో మట్టి పాత్రలతోనే వంటను చేసేవారు. అలాంటి వాటిల్లో ఆహారాన్ని తయారు చేస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వాటినే వాడేవారు. కానీ ఆ తర్వాత స్టీల్, రాతిండి, నాన్ స్టిక్ ఇలా రకరకాల వంట పాత్రలు
- Author : Ramesh
Date : 13-04-2024 - 10:18 IST
Published By : Hashtagu Telugu Desk
Glass Items ఒకప్పుడు ఇంట్లో మట్టి పాత్రలతోనే వంటను చేసేవారు. అలాంటి వాటిల్లో ఆహారాన్ని తయారు చేస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వాటినే వాడేవారు. కానీ ఆ తర్వాత స్టీల్, రాతిండి, నాన్ స్టిక్ ఇలా రకరకాల వంట పాత్రలు వచ్చాయి. వండిన వంటని నిలువ ఉంచేందుకు గాజు పాత్రలను వాడుతున్నారు. గాజు పాత్రలను వాడకం బాగున్నా వాటిని శుభ్రం చేయడానికి మాత్రం కష్టపడుతుంటారు.
గాజు పాత్రలను ఈ పద్ధతులను అనుసరించి క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతాయి. గాజు పాత్రలను కూడా స్టీల్, ఇత్తడి పాత్రలను తోమినట్టుగా పీచుతో కాకుండా మెత్తని స్పాంజ్ తో క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇంకా బ్రష్ తో క్లీన్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది.
గాజు పాత్రలను చల్లని నీళ్లకు బదులుగా వేడి నీళ్లతో శుభ్రం చేస్తే బాగుంటుంది. గాజు పాత్రలపై మనకు కనిపించని బ్యాక్టీరియాను వేడి నీళ్లతోనే శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా జిడ్డు మరకలు కూడా వేడు నీళ్ల ద్వారా అయితే త్వరగా శుభ్రం చేసే అవకాశం ఉంటుంది.
రెగ్యులర్ గా పాత్రలకు శుభ్రం చేసే డిష్ వాష్ బార్ లను పక్కన పెట్టి సహజమైన పద్ధతిలో గాజు పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. వెనిగర్ తో నిమ్మ బేకింగ్ సోడా కలిపి గాజు పాత్రలకు అప్లై చేసి క్లీన్ చేస్తే పాత్రలు ఎంతో శుభ్రం అవుతాయి. అంతేకాదు గాజు పాత్రలు కొత్త వాటిలానే తలతలాడుతాయి.
మరీ మరకలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే ఒకసారి తూట్ పేస్ ను కూడా అప్లై చేసి ఆ తర్వాత లెమన్ తో క్లీన్ చేస్తే గాజు పాత్రలు శుభ్రం అవుతాయి.
Also Read : David Warner in Pushpa 2 : పుష్ప 2 లో ఆ క్రికెటర్.. అదే జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్..!