David Warner in Pushpa 2 : పుష్ప 2 లో ఆ క్రికెటర్.. అదే జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్..!
David Warner in Pushpa 2 అల్లు అర్జున్, సుకుమార్ ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించగా ఆ సెన్సేషన్స్ ను కొనసాగించేందుకు పుష్ప 2 తో మళ్లీ వస్తున్నారు.
- Author : Ramesh
Date : 13-04-2024 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
David Warner in Pushpa 2 అల్లు అర్జున్, సుకుమార్ ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించగా ఆ సెన్సేషన్స్ ను కొనసాగించేందుకు పుష్ప 2 తో మళ్లీ వస్తున్నారు. ఈ ఇయర్ ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ లాక్ చేశారు. సినిమాపై అంచనాలు పెంచేలా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేస్తుంది. పుష్ప 2 సుక్కు కాలిక్యులేషన్స్ ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
పుష్ప 2 సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని అందులో ఒకటి స్టార్ క్రికెటర్ కూడా క్యామియో రోల్ చేశాడని టాక్. పుష్ప 2 లో ఆస్ట్రేలియ క్రికెటర్ డెవిడ్ వార్నర్ ఉంటాడని ఫిల్మ్ నగర్ టాక్. తన బ్యాట్ తో ప్రత్యర్ధులకు చెమటలు పట్టించే వార్నర్ పుష్ప సినిమా లోని ప్రతి మూమెంట్ ని ఇమిటేట్ చేసిన సందర్భం తెలిసిందే. పుష్ప లోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన వార్నర్ తగ్గేదేలే అని తన మార్ఫింగ్ వీడియో చేశాడు.
పుష్ప కి క్రికెటర్స్ లో కూడా క్రేజ్ వచ్చేలా చేయడంలో వార్నర్ కారణమయ్యాడు. అల్లు అర్జున్ ప్రతి అప్డేట్ ని ఫాలో అవుతున్న వార్నర్ ఈమధ్యనే మేడం టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు బొమ్మ గురించి కూడా క్రేజీ కామెంట్స్ చేశాడు. ఇవన్నీ అల్లు అర్జున్ పై తనకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నాయి. అందుకే పుష్ప 2 లో డేవిడ్ వార్నర్ ని ఒక స్పెషల్ రోల్ కి తీసుకుంటున్నారని టాక్.
అదే నిజమైతే మాత్రం డేవిడ్ వార్నర్ వల్ల పుష్ప కి ఆస్ట్రేలియాలో కూడా క్రేజ్ వస్తుంది. పుష్ప 2 లో డేవిడ్ వార్నర్ ఉంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. పుష్ప 2 కోసం సుకుమార్ ఎవరికి ఊహించని ప్లాన్స్ వేస్తున్నాడని తెలుస్తుంది.
Also Read : Family Star : అయ్యో ఫ్యామిలీ స్టార్ ఎంత పని జరిగింది..!