Banana Tips: రోజుకి ఎన్ని అరటిపండ్లు తినాలి.. అతిగా తింటే ఏం జరుగుతుంది?
Banana Tips: సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పారటు దొరికే పండ్లు ఏవైనా ఉన్నాయి అంటే అవి అరటి పండ్లు మాత్రమే అని చెప్పవచ్చు. అరటిపండు ఏడాది పొడవునా లభిస్తూ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి.
- By Anshu Published Date - 09:30 AM, Sat - 15 October 22

Banana Tips: సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పారటు దొరికే పండ్లు ఏవైనా ఉన్నాయి అంటే అవి అరటి పండ్లు మాత్రమే అని చెప్పవచ్చు. అరటిపండు ఏడాది పొడవునా లభిస్తూ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఈ అరటిపండ్లను చిన్న పిల్లలనుంచి ముసలి వారి వరకు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అరటిపండ్లు టేస్టీగా ఉండటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అలాగే అరటి పండ్లను మోతాదుకు మించి తింటే ఎన్నో రకాల సమస్యలను కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అరటిపండును ఎక్కువగా తింటే ములబద్ధకం సమస్య వస్తుంది.
అంతే కాకుండా మైగ్రేన్ సమస్య కూడా వస్తుంది. మరి రోజుకు ఎన్ని అరటి పండ్లను తినవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధుమేహం ఉన్నవారికి అరటి పండ్లు అంత మంచిది కాదు. రైతుబంధులను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో విపరీతంగా పెరిగిపోతాయి. అంతేకాకుండా అరటిపండును ఎక్కువగా తినడం వల్ల అదేకంగా బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలి అనుకున్న వారు అరటిపండుకు దూరంగా ఉంటే మంచిది. అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువైతే హైపర్కెల్మియా అనే అనారోగ్య సమస్య వస్తుంది.
అరటిలో అధికమొత్తంలో ఉండే ఫైబర్ వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. అరటిపండ్లను అతిగా తినడం వల్ల దంతక్షయం సమస్య కూడా వస్తుందట. ప్రతి రోజూ రెండు అరటిపండ్లను తినాలి. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే అరటిపండు తినాలి. అలాగే అయితే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండ్లను తినకూడదు. ఈ పండ్లు ఈ సమస్యలను మరింత ఎక్కువ చేస్తాయి. ప్రతి రోజూ ఒక అరటి పండు తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదికూడా మీడియం సైజులో ఉండే అరటిపండును మాత్రమే తీసుకోవాలి.