Summer health Tips: వేసవికాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు.. ఆరోగ్యం మీ సొంతం అవ్వాల్సిందే!
వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:03 PM, Fri - 21 February 25

వేసవికాలం ఇంకా ఆరంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో కొద్దిసేపు ఎండలోకి వెళ్తే చాలు విపరీతమైన చెమటలు, గొంతు ఎండిపోవడం, నీరసంగా అనిపించడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రారంభంలోనే ఇలా ఉంది అంటే పోను పోను ఎండలో ఇంకా ఎలాంటి విశ్వరూపం చూపిస్తాయో అని తలుచుకుంటేనే భయమేస్తోంది. ఎండలు ఇంకా ముదిరితే.. వడదెబ్బ వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి.
మరి వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అధికంగా కార్బోహైడ్రెట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం శరీర ఊష్ట్రోగ్రత పెరిగే అవకాశం ఉంది. అందుకే అధికంగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలతో పాటు తరచు కొబ్బరి నీళ్లు, బత్తాయి వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే అధిక నీటి శాతం కలిగిన పుచ్చకాయ,దోసకాయ, కీరదోస కర్బూజా వంటి పనులను తీసుకోవాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత వల్ల త్వరగా ప్రభావితమయ్యే శరీర భాగాల్లో కళ్లు ప్రధానమైనవి. అందుకే ఎండా కాలంలో కళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. బయటకి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు.
ముఖ్యంగా కళ్లు పూర్తిగా కవర్ అయ్యేలా ఉండే కళ్లజోడును ఉపయోగించాలని చెబుతున్నారు. ఆల్కాహాల్ శరీరాన్ని త్వరగా డీ హైడ్రేట్ చేస్తుందట. వేసవిలో డీ హైడ్రేట్ అవ్వడం అంతమంచిది కాదట. అందుకే ఎండకాలంలో ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వేసవిలో వీలైనంతవరకు ఇంట్లో లేదా నీడ ప్రాంతాల్లో ఉండేందుకు ప్రయత్నించాలట. అలాగే ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని, ఏవైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పెట్టుకోవాలని చెబుతున్నారు. ఎండలో ఎక్కువగా తిరిగేవారు బయటకు ఎండకు వెళ్లేవారు తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. నోరు పొడి బారుతున్న కొద్ది నీళ్లు తాగడం మంచిది. వేసవికాలంలో చెమట రూపంలో ఎక్కువగా నీళ్లు ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. దూర ప్రయాణాలు చేస్తుంటే వాటర్ బాటిల్స్ లో తీసుకెళ్లడం మంచిదని చెబుతున్నారు.