Tulasi Seeds: తులసి ఆకులు మాత్రమే కాదు.. తులసి గింజలతో కూడా అటువంటి సమస్యలకు చెక్?
Tulasi Seeds: భారతీయుడు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తూ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే భారతీయుల ఇంటిముందు కచ్చితంగా తులసి కోట ఉంటుంది.
- By Anshu Published Date - 09:30 AM, Tue - 11 October 22

Tulasi Seeds: భారతీయుడు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తూ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే భారతీయుల ఇంటిముందు కచ్చితంగా తులసి కోట ఉంటుంది. తులసి మొక్కను దైవంగా భావిస్తూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఔషద గుణాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తులసి మొక్క ఎన్నో రకాల జబ్బులను దూరం చేస్తుంది. అంతేకాకుండా తులసి ఆకులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే కేవలం తులసి ఆకులు మాత్రమే కాదండోయ్ తులసి గింజలు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మరి తులసి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..తులసి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ప్రోటీన్లు,ఫైబర్, ఐరన్, ఫినాలిక్ పుష్కలంగా లభిస్తాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. తులసి గింజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం తులసి గింజల కాషాయాన్ని తాగడం మంచిది. ఈ తులసి గింజల వల్ల ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అందుకోసం తులసి గింజలను నీళ్లలో బాగా నానబెట్టి అవి ఉబ్బిన తర్వాత నీటితో పాటు తాగడం వల్ల జీర్ణసమస్యలు తొలగిపోతాయి. బరువు నియంత్రించుకోవడంలో కూడా తులసి గింజలు బాగా సహాయపడతాయి. తులసి గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. తులసి గింజలను తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దాంతో ఆహారం సరిగా ఆకలి కాక బరువు ఈజీగా తగ్గుతారు. తులసి గింజలు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ గింజలు ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తాయి. మరి ముఖ్యంగా ఈ తులసి గింజలను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.