Tamarind Seeds: చింత గింజలు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు.. అవేంటంటే!
Tamarind Seeds: చింత గింజలు ఆరోగ్యానికి మంచివని వీటి వల్ల కలిగే లాభాలు తెలిస్తే వాటిని తినకుండా అసలు ఉండలేరని అసలు వదిలిపెట్టరని చెబుతున్నారు. మరి చింత గింజల వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 PM, Thu - 16 October 25

Tamarind Seeds: మామూలుగా మనం చింతపండును రకరకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండు లేదా చింతకాయలను తినేసి వాటి గింజలను పారేస్తూ ఉంటాం. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని భావిస్తూ ఉంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే అని చింత గింజల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చింతపండులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో వాటి గింజల్లోనూ అదే స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు.
చింత గింజలలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్ లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయట. అంతేకాదు చింత గింజలు అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. చింత గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. వీటిని తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని, అంతేకాదు ఈ గింజల పొడి శరీరంలో వాపును తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని, కీళ్ల వాపు, నొప్పి ఉన్నవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయట. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయని, అంతేకాదు చింత గింజల్లో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు శరీరాన్ని వైరస్ లు, బ్యాక్టీరియా నుంచి కాపాడుతాయని,జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. కాగా చింత గింజల్లో ఉండే హైల్ రోనిక్ యాసిడ్ చర్మానికి అవసరమైన తేమను అందిస్తుందట. చింత గింజల పొడిని పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయట. అలాగే చర్మం మృదువుగా మారుతుందట. పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందని, చింత గింజల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.