White Hair : తెల్ల జుట్టు వచ్చిందా!నల్లగా మారడానికి హోమ్ రెమెడీ
- By Vamsi Chowdary Korata Published Date - 06:45 AM, Wed - 3 December 25
జుట్టు తెల్లబడడానికి ముఖ్య కారణం పోషకాహార లోపంతో పాటు కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం. సరైన కేర్ తీసుకోకపోయినా జుట్టు తెల్లబడుతుంది. అలాంటి తెల్లజుట్టుని నేచురల్‌గానే నల్లగా మార్చేందుకు హెన్నా, కెమికల్ కలర్స్, డైలు వాడుతుంటారు. అయితే, ఇవన్నీ మళ్లీ కెమికల్స్‌తో తయారైనవే. అలా కాకుండా, జుట్టు నేచురల్‌గానేనల్లగా మారేందుకు ఇంట్లోని కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి.
తెల్లజుట్టు కనిపించగానే చాలా మంది ఏజ్ పెరిగిందని బాధపడుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో 30 ఏళ్ళు దాటకముందే తెల్లజుట్టు వస్తోంది. దీనికి కారణం ఒత్తిడి, సరైన కేర్ తీసుకోకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సమస్యని కవర్ చేసుకునేందుకు చాలా మంది కెమికల్స్‌తో కూడి ప్రోడక్ట్స్ షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే, అవి రిజల్ట్ చూపించినప్పటికీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా, నేచురల్‌గానే నల్లగా మారేందుకు మనం ఇంట్లోనే కొన్ని పదార్థాలని వాడి జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. కెమికల్స్ లేకుండానే జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో తెలుసుకోండి.
ఉసిరి పొడి, కొబ్బరినూనె
ఉసిరి పొడిని తీసుకోండి. దీనిని మీరు కొబ్బరినూనెలో వేసి మీడియం మంటపై వేడి చేయండి. నూనె రంగు మారిన తర్వాత మంటని తీసేయండి. ఇది గోరువెచ్చగా అయ్యాక తలకి రాసి బాగా మసాజ్ చేయండి. రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. దీని వల్ల మెరిసే, నల్లని జుట్టు మీ సొంతమవుతుంది. వారానికి రెండుసార్లు ఈ నూనెని రాయడం అలవాటు చేసుకోండి.
హెన్నా, కాఫీ పొడితో నల్లని జుట్టు
జుట్టుని నల్లగా మార్చేందుకు కాఫీ, హెన్నా రెండు హెల్ప్ చేస్తాయి. ముందుగా బ్లాక్ కాఫీలో హెన్నా పొడిని కలపండి. పేస్టులా చేసి తెల్ల జుట్టుకి అప్లై చేయండి. అరగంట నుంచి గంట వరకూ ఉంచుకుని జుట్టుని క్లీన్ చేయండి. ఇది మీ జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా కండీషన్ కూడా చేస్తుంది. జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి.
ఉల్లిపాయరసం, తేనెతో తెల్లని జుట్టు మాయం
ఉల్లిపాయ రసం కూడా జుట్టుని నల్లగా మారుస్తుంది. ఉల్లిపాయ రసంలో ఓ టీస్పూన్ తేనెని వేసి బాగా కలపండి. తలకి దీనిని అప్లై చేసి 30 నిమిషాల పాటు అలానే ఉంచండి. ఇది మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల తెల్లజుట్టు కూడా తగ్గుతుంది. చిన్నవయసులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యని దూరం చేసుకోవడానికి ఈ టిప్ బాగా పని చేస్తుంది.
కరివేపాకు, పెరుగుతో నల్లని జుట్టు
సాధారణంగా కరివేపాకు, పెరుగు ఈ రెండు కూడా విడివిడిగా జుట్టుకి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి హెయిర్ ప్యాక్‌గా తయారుచేసి జుట్టుకి రాస్తే జుట్టు మూలలకి పోషణ అంది జుట్టు నల్లగా మారుతుంది. వారానికోసారి ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. జుట్టు కూడా నల్లగా మారుతుంది.
మరికొన్ని చిట్కాలతో తెల్లజుట్టు మాయం
- ప్రతిరోజూ పడుకునే ముందు జుట్టుకి కొబ్బరినూనె రాసి మసాజ్ చేయండి. ఉదయాన్నే తలని క్లీన్ చేసుకోండి.
- అదే విధంగా, ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తినాలి.
- ప్రతిరోజూ కొద్దిగా తాజా ఆమ్లా రసాన్ని తాగండి.
- వారానికి రెండు నుండి మూడుసార్లు నల్లనువ్వులు తినండి. దీంతో జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు కూడా దూరమవుతుంది.