Beauty Tips : అందమైన మొహంపై మచ్చలు వేధిస్తున్నాయా..అయితే అతి తక్కువ ఖర్చుతో బ్యూటీ టిప్స్!!
ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలు, పురుషులు వయస్సు తో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య మంగు మచ్చలు. దాదాపు 25 ఏళ్లు వచ్చాయంటే ఈ మచ్చలు వస్తున్నాయి. తెల్లగా ఉన్న ముఖంపై ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- By hashtagu Published Date - 09:00 AM, Wed - 20 July 22

ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలు, పురుషులు వయస్సు తో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య మంగు మచ్చలు. దాదాపు 25 ఏళ్లు వచ్చాయంటే ఈ మచ్చలు వస్తున్నాయి. తెల్లగా ఉన్న ముఖంపై ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వారి మొహం అందహీనంగా కనిపిస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడంలేదని ఎంతో మంది బాధపడుతుంటారు. శరీరంలో అనేక మార్పులు సంబవించడంతో ప్రధానంగా చర్మంపై ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే వీటిని పూర్తిగా నివారించకున్నా….చర్మంపై కనిపించకుండా నిరోధించవచ్చు. అలాంటి కొన్ని స్కిన్ ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ ఫేస్ మాస్క్ :
అవసరమైన పదార్థాలు
1 స్పూన్ గ్రీన్ టీ పొడి
1 టేబుల్ స్పూన్ తేనె
1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్
తయారీ విధానం:
వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా చేయాలి. మీ ముఖాన్ని కడిగిన తర్వాత, మీ ముఖం, మెడపై అప్లై చేయండి. 15-20 నిమిషాలు పొడిగా ఉండనివ్వండి. తరువాత, తడి గుడ్డతో తుడవండి. దీన్ని వారానికి 2-3 సార్లు రిపీట్ చేయండి. ముఖంపై మచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది.
పసుపు ఫేస్ ప్యాక్ :
అవసరమైన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ అరషిన పసుపు
పెరుగు 1 టేబుల్ స్పూన్
1 టేబుల్ స్పూన్ తేనె
తయారీ విధానం :
అన్నింటినీ ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మాస్క్‌ని మీ ముఖం, మెడపై అప్లై చేసుకోవాలి.15-20నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తడువాలి.
చాక్లెట్ ఫేస్ మాస్క్
అవసరమైన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ కోకా పౌడర్
1 టేబుల్ స్పూన్ తేనె
1 టేబుల్ స్పూన్ పాలు
తయారీ విధానం :
అన్నింటినీ ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మాస్క్‌ని మెడ, ముఖానికి అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత తడి గుడ్డతో తుడవండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.
కాఫీ ఫేస్ మాస్క్
అవసరమైన పదార్థాలు
1 చెంచా కాఫీ పొడి
పెరుగు 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం :
వీటన్నింటిని ఒక బౌల్లో తీసుకుని పేస్టులా తయారు చేయండి. ఈ మాస్క్‌ని మెడ, ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాలు ఆరనివ్వండి. తడి గుడ్డతో తుడవండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.
గుడ్డు ఫేస్ మాస్క్
అవసరమైన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ గుడ్డు తెల్లసొన
½ స్పూన్ నిమ్మరసం
తయారీ విధానం
ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన తీసుకుని దానిలో చెంచా నిమ్మరసం కలపండి. మీ ముఖాన్ని కడుక్కోని కాటన్ బాల్‌తో ముఖంపై అప్లై చేయండి. ఇలా 15-20 నిమిషాలు చేయండి. తడి టవల్ తో తుడవండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.
ఈ ప్యాక్స్ తరచుగా ఉపయోగించడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురికితోపాటుగా..మంగు మచ్చలను కూడా దూరం చేసుకోవచ్చు.