Potatoes For Beauty: బంగాళదుంపతో అందాన్ని రెట్టింపు చేసుకోండిలా?
బంగాళదుంపల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బంగాళదుంపలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందరికి కూడా
- By Nakshatra Published Date - 09:19 PM, Thu - 3 August 23
బంగాళదుంపల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బంగాళదుంపలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందరికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి అందానికి ఆలుగడ్డ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళాదుంపలో పిండి పదార్ధాలు ఉంటాయి. అలాగే ఇందులో విటమిన్ సీ, విటమిన్- బి6, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా కొద్ది మొత్తంలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి మూలకాలు కూడా ఉంటాయి. కళ్ల కింద నల్ల మచ్చలను తొలగించేందుకు బంగాలదుంప బాగా పనిచేస్తుంది. బంగాళ దుంపలను గుండ్రంగా తరగాలి. వాటిని కాసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత వాటిని కళ్ల కింద పెట్టుకోవాలి.
రోజూ చేస్తే నల్లమచ్చలు మాయమవుతాయి. అలాగే బంగాళాదుంపని మిక్సీలో వేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారి, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత శుభ్రం చేస్తే చర్మం రంగు తేలుతుంది. ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని కాసేపు ఆరనీవ్వాలి. ముందు గోరువెచ్చటి నీటితోనూ, తరవాత చల్లని నీటితో కడిగేయాలి. బంగాళాదుంపని ఉడకబెట్టి ముద్దలా చేసి, ఒక స్పూను పాల పొడి, ఒక స్పూను బాదం నూనె కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరవాత శుభ్రపరిస్తే ముఖంపై ఛాయ మెరుగుపడుతుంది.
ముల్తాని మట్టిలో చెంచా ఆలుగడ్డ గుజ్జు రసం, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలపాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆలుగడ్డను తురిమి రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి కోడిగుడ్డు, పెరుగు కలపండి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి మొత్తం వెంటుకలకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి, షాంపుతో తలంటుకోండి. మీ జట్టుకు బోలెడంత బలం వస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మూడు టేబుల్ స్పూన్ల బంగాళా దుంపల రసం, 3 స్పూన్ల కలబంద రసం, 2 స్పూన్ల తేనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మీ జుట్లు మెరిసిపోతుంది.
Related News
Buttermilk: వేసవిలో మజ్జిగతో మీ అందాన్ని రెట్టింపు.. ఎలా అంటే?
పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం త