శీతాకాలంలో చల్లని నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
చలికాలంలో కూడా చల్లని నీరు తాగే అలవాటు ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని లేదంటే లేనిపోని సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మరి చలికాలంలో చల్లనీరు తాగితే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 18-12-2025 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
- చల్లని నీరు వల్ల కలిగే సమస్యలు
చలికాలంలో చల్ల నీరు వల్ల కలిగే సమస్యలు
చల్ల నీరు తాగితే వచ్చే సమస్యలుCold Water: మామూలుగా కొందరికి సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లో కూల్ వాటర్ తాగడం అలవాటు. ఎక్కువ శాతం మంది కేవలం ఎండాకాలంలో మాత్రమే చల్లని నీరు తాగుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం చలికాలం అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి చలికాలంలో చల్లని నీరు తాగడం మంచిదేనా? తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చల్లని నీరు మన పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట.
అవును చల్లని నీటి కంటే వేడి నీరు లేదా సాధారణ నీరు పేగు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. చల్లటి నీరు తాగడం వల్ల మన జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుందట. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. చల్లటి నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుందట. దీని వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయని, ఇది గుండెపై ఒత్తిడిని కూడా పెంచుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు చల్లటి నీటికి చాలా దూరంగా ఉండాలట. కాబట్టి మీరు ఆరోగ్యమైన గుండె పనితీరు, ప్రేగు ఆరోగ్యం కోసం గోరువెచ్చని, లేదా సాధారణ నీటితో తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ముఖ్యంగా చలికాలంలో చల్లని నీరు తాగడం వల్ల దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యలు మరింత ఎక్కువ కావచ్చు అని చెబుతున్నారు. కొన్ని సార్లు ముక్కు దిబ్బడ కారణంగా సరిగా ఊపిరి ఆడక పోవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి చలికాలంలో చల్లిని నీరు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ మీరు చలికాలంలో చల్లని తాగాలి అనుకుంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే గోరువెచ్చని నీరు, లేదా సాధారణ నీరు తాగాలని చెబుతున్నారు.