HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Does Drinking Alcohol Lead To Good Sleep How True Is It

Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

  • Author : Vamsi Chowdary Korata Date : 09-07-2026 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Does drinking alcohol lead to good sleep? How true is it?
Does drinking alcohol lead to good sleep? How true is it?

కొంతమందికి సందర్భం ఏదైనా సరే… మందు సేవించడమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి వారు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా స్నేహితులతో సరదాగా ఆల్కహాల్ తాగేవారు, అదే పనిగా అలవాటు చేసుకుంటున్నారు. ఫలితంగా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. కానీ మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించినట్లయితే… ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మితంగా తీసుకున్నట్లయితే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్, డోపమైన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో మెదడు ఉత్తేజితం అవుతుంది. శరీరానికి తీసుకునే ఇతర పదార్థాల కన్నా ఆల్కహాలే తొందరగా శరీరంపై ప్రభావం చూపుతుంది. ఈ ఆల్కహాల్ ముందుగా జీర్ణశయానికి వెళ్లి… అక్కడి నుంచి నేరుగా రక్తంలో కలిసిపోతుంది. తర్వాత మెదడు, కాలేయం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతుంది.

అయితే ఆల్కహాల్ సేవించినట్లయితే నిద్ర బాగా పడుతుందని చాలామంది అనుకుంటారు. అయితే నిద్రలేమితో బాధపడేవారే… రాత్రి సమయంలో ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడుతున్నవారిలో కొందరు ఆల్కహాల్ తీసుకుంటే… మరికొందరు నిద్రమాత్రలు మింగుతున్నారు. నిజానికి మద్యం సేవించి పడుకున్నట్లయితే హాయిగా నిద్రపడుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. ఇక రాత్రిపూట ఆల్కహాల్ సేవించి నిద్రపోతాననుకునేవారికి నిద్రతోపాటు సమయం వృథా అవడమే కాదు… నిద్రలేమి సమస్య కూడా వస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆల్కహాల్ సేవించడం వల్ల మత్తు వల్ల కొన్ని గంటల వరకు నిద్ర బాగా వస్తుంది కానీ తర్వాత పూర్తి నిద్ర రాదని అధ్యయనాలు తేల్చేశాయి. ఈ సమస్య ఎక్కువగా మగవారి కంటే ఆడవారిలోనే అధికంగా కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మిచిగాన్ యూనివర్సిటీ దీనిపై పరిశోధనలు చేసి, అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఈ పరిశోధనలో 20 సంవత్సరాల యువతను తీసుకుని వారికి మొదటిరోజు ఆల్కహాల్ కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చారు. తర్వాత రోజు కేవలం వాసన కోసమే కూల్ డ్రింక్స్‌లో మందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత వారిని పరిశీలిస్తే… ఆల్కహాల్ సేవించిన రోజు వారు తొందరగా నిద్రపోయినప్పటికీ… కొద్ది సేపటికే మేల్కొన్నారు. ఆ తర్వాత ఎంత సేపటి వరకు కూడా నిద్రపట్టక మసలడాన్ని గమనించారు. మద్యం సేవించడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోతామనుకోవడం అపోహగా తేల్చారు. ఇంకో విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం దెబ్బతిని… కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల జీర్ణశయంలో ఆమ్లాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పేగుల్లో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ ఆకలి లేకుండా చేయడంతోపాటు కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • best medicine
  • good sleep
  • health problems
  • medicine
  • Tips For Good Sleep

Related News

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd