Glowing Skin: ముఖంపై మొటిమలతో బాధపడుతున్నారా.. అయితే చిట్కాలు పాటించాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.
- By Nakshatra Published Date - 06:45 AM, Thu - 6 October 22
ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. చర్మం నిగారింపుగా తరతల మెరిసిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మగవారి కోసం కూడా ఎన్నో రకాల పేస్ క్రీమ్ లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే వాతావరణాన్ని బట్టి మామూలుగా జన్మ సౌందర్యం ఆధారపడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొంతమందికి కొన్ని కారణాలవల్ల చిన్న వయసులోనే చర్మ ముడతలు పడి ముసలి వారిలో కనిపిస్తూ ఉంటారు.
అటువంటివారు స్కిన్ కోసం అనేక రకాల టిప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం తినే ఆహారంతో పాటుగా చర్మానికి రాసే ఫేస్ క్రీమ్ లను బట్టి కూడా చర్మ సౌందర్యం ఆధారపడి ఉంటుంది అంటున్నారు నిపుణులు. చర్మ సౌందర్యం కోసం చాలామంది మార్కెట్లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడి వారి సౌందర్యాన్ని మరింత కోల్పోతూ ఉంటారు. అయితే చర్మ సౌందర్యం కోసం కేవలం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు మాత్రమే కాకుండా సహజ సిద్ధంగా కూడా చర్మాన్ని తల తల మెరిసేలా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
మరి ఇందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఉసిరి, వేప,పసుపు వంటి పదార్థాలను ఆహారంతో పాటుగా తీసుకోవడం చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటుగా చర్మం లోపల ఉండే విష పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. దాంతో చర్మం మెరవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారంలో కనీసం ఒక్కసారి అయినా చేపలు తినడం వల్ల అవి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. అదేవిధంగా బాదంపప్పు,అవిసె గింజలు కూడా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యానికి ఎంతో మేలుని చేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా ఆమ్లాలు చర్మం లోని తేమ బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటుగా చర్మం నునుపుగా ఉండడానికి బాగా దోహద పడతాయి. అలాగే చర్మం తల తల మెరిసిపోవాలి అనుకున్న వారు గోధుమలు పెసలు వంటి బార్లీ తో చేసిన ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా గోధుమలు పెసలు పొట్టు తీయకుండా వాటితో ఏవైనా ఆహార పదార్థాలు చేసుకొని తినడం వల్ల ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి.
Related News
Neem Leaves : వేప ఆకులను తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు..!
భూమిపై ఉన్న అత్యంత ఔషధ మొక్కలలో వేప చెట్టు ఒకటి. వేప గింజలు శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి , పేగు పురుగులను తొలగించడానికి ఉపయోగిస్తారు.