AAP : ‘స్వాతి మాలివాల్ కా సచ్’..వైరల్ అవుతున్న వీడియో
- Author : Latha Suma
Date : 17-05-2024 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
AAP: ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ సీఎం ఆర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆప్ తన పార్టీ ఎంపీ స్వాతి మీదనే సోషల్ మీడియా ద్వారా ఎటాక్ చేసింది. ఘటన జరిగిన రోజుకు సంబంధించిన ఓ క్లిప్పింగ్‌ను అధికారిక ఎక్స్‌ఖాతాలో పోస్టు చేసి, దానికి ‘స్వాతి మాలివాల్ కా సచ్’ అనే టెక్స్ట్‌ను జతచేసింది.
स्वाति मालीवाल का सच https://t.co/TGqvnCj619
— AAP (@AamAadmiParty) May 17, 2024
We’re now on WhatsApp. Click to Join.
అయితే స్వాతి మాలివాల్‌పై దాడి జరిగినట్టుగా చెబుతున్న రోజున కేజ్రీవాల్ నివాసంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో క్లిప్పింగ్ ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని స్వాతి మాలివాల్ బూతు పదజాలంతో దూషించింది. ‘గంజా సాలా’ అని వ్యాఖ్యానించింది. ఈ క్లిప్పింగ్‌నే ఆప్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేస్తూ.. ‘స్వాతి మాలివాల్ కా సచ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
Read Also: Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్, కేజ్రీవాల్ నిందితుడిగా చార్జిషీట్
కాగా, మే 13న ఈ ఘటన జరుగగా ఈ ఐదురోజుల్లో స్వాతిమాలివాల్‌కు వ్యతిరేక ఆప్ నోరు విప్పడం ఇదే తొలిసారి. కాగా ఆప్ పోస్టు చేసిన వీడియో ఒరిజినలా.. నకిలీదా అనే విషయాన్ని తాము ఇంకా డిసైడ్ చేయలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా, స్వాతిమాలివాల్ ఈ నెల 13 కేజ్రివాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి తనపై దాడి చేశాడని మాలివాల్ పోలిసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆప్ తొలిసారిగా మాలివాల్‌పై చేసింది.