HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Curd Chia Seeds Benefits Is Curd With Chia Seeds Good For Weight Loss

‎Weight Loss: ఇవి తింటే చాలు.. జిమ్ తో అవసరం లేకుండా పొట్టలో కొవ్వు కరిగిపోవడం ఖాయం!

‎Weight Loss: ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు తింటే జిమ్ కీ వెళ్లకుండానే ఈజీగా కొవ్వు కరిగిపోవడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి వెయిట్ లాస్ కోసం ఏమి తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • By Anshu Published Date - 07:00 AM, Tue - 28 October 25
  • daily-hunt
Weight Loss
Weight Loss

‎Weight Loss: ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల లేనిపోని సమస్యలు కూడా రావచ్చు. అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గడం కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే పెరుగు, చియా గింజలు ఇవి రెండు బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ రెండింటినీ కలిపి తింటే, అది సూపర్‌ ఫుడ్‌ గా పనిచేస్తుందట. చియా గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటుగా అనేక పోషకాలు ఉంటాయి.
‎
‎అదే సమయంలో పెరుగు ప్రోబయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. పెరుగు, చియా విత్తనాల కలయిక జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా పెరుగు, చియా గింజలలోని ప్రోబయోటిక్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందట. చియా గింజలు నీటిలో ఉబ్బి జెల్ లాంటి స్థితిని ఏర్పరుస్తాయట. ఇది పేగులను శుభ్రపరుస్తుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. పెరుగుతో కలిపి తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుందట. కడుపు సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
‎
‎ మీరు బరువు తగ్గాలనుకుంటే, పెరుగు, చియా విత్తనాల కలయిక మీకు మంచి ఎంపిక అని చెబుతున్నారు. చియా విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుందట. అనారోగ్యకరమైన కోరికలను తగ్గిస్తుందని, పెరుగులోని ప్రోటీన్ జీవక్రియను పెంచుతుందని తద్వారా కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుందని పొత్తి కడుపులో కొవ్వును కరిగించుకుంటుంది అని చెబుతున్నారు. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను బలపరుస్తుందట. చియా విత్తనాలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు కూడా కనిపిస్తాయి. ఇవి ఎముక సాంద్రతను పెంచడంలో సహాయపడతాయట. అందువల్ల పెరుగు, చియా విత్తనాలను తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చని చెబుతున్నారు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.
‎
‎ చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయట. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. పెరుగు, చియా గింజలు చర్మానికి చాలా మేలు చేస్తాయట. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుందని, ఇది చర్మాన్ని తేమ చేస్తుందని, దాని మెరుపును పెంచుతుందని చెబుతున్నారు. చియా విత్తనాలలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చర్మపు మంటను తగ్గిస్తాయట. మొటిమలు, ముడతలను నివారిస్తాయని, జుట్టు బలంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా చియా విత్తనాలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయట. పెరుగుతో వీటిని తినడం వల్ల శరీరానికి ఎక్కువ కాలం శక్తి లభిస్తుందని, ఇది అలసటను తగ్గడంతో పాటు శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chia Seeds
  • curd
  • curd benefits
  • weight loss

Related News

Curd

‎Curd: వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు ఆ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే!

‎Curd: వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తీసుకునే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని లేదంటే లేనిపోని సమస్యలు వచ్చి అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Weight Loss

    ‎Weight Loss: నెయ్యిలో ఈ పొడి కలిపి తింటే చాలు.. ఐస్ లాగా బరువు తగ్గడం ఖాయం!

  • Bottle Gourd

    ‎Bottle Gourd: అధికబరువుతో బాధపడుతున్నారా.. అయితే సొరకాయతో ఇలా చేయాల్సిందే!

  • Blood Sugar

    Blood Sugar: మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!

Latest News

  • Gold Rate Today : ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు..!!

  • Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!

  • Pawan Kalyan : పవన్ ఎవరికీ ఓకే చెపుతాడు..?

  • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

  • Karur Stampede : కరూర్ బాధితుల హృదయాలను గెలుచుకున్న విజయ్..ఏంచేసాడో తెలుసా..?

Trending News

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

    • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd