HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Consult A Doctor Immediately If There Is Swelling In The Legs

Legs: కాళ్ళల్లో వాపు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి..

ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల పాదాల్లో కాస్త నీరు చేరి వాపు కనిపిస్తుంది. కానీ అది కొంచెం సేపటికి తగ్గిపోతుంది. దీర్ఘకాలం పాటు వాపు ఉంటే మాత్రం అది...

  • Author : Maheswara Rao Nadella Date : 11-03-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Feet Warning Symptoms
Feet Warning Symptoms

పాదాలు, చీలమండ, కాళ్ళలో (Legs) వాపుగా అనిపిస్తుందా? వాటి మీద ఒత్తిడి పడినప్పుడు డింపుల్ పడుతుందా? అయితే మీ కిడ్నీలు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయని అర్థం. ఒక్కోసారి కళ్ళు కూడా ఉబ్బిపోయి కనిపిస్తాయి. ఇది కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. సుమారు 30 శాతం మంది కిడ్నీ రోగులు చాలా ఆలస్యంగా డాక్టర్ ని సంప్రదిస్తున్నారు. దీని వల్ల కిడ్నీలు అప్పటికే ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఫలితంగా  డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది.

కిడ్నీ వ్యాధిని గుర్తించడం ఎలా?

హైబీపీ, డయాబెటిక్ రోగులకు తరచుగా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎందుకంటే హైబీపీ రక్త నాళాలు సంకోచిస్తాయి. ఇవి చివరికి వాటిని దెబ్బతీయడం లేదా బలహీనపడేలా చేస్తుంది. డయాబెటిక్ రోగుల్లో రక్తంలోని అదనపు చక్కెర తొలగించడం కోసం మూత్రపిండాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అప్పుడు కిడ్నీల మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వెనుక మరొక కారణం శరీరం నీటిని నిలుపుకోవడం. కాళ్ళు (Legs), చీలమండలు, పాదాలలో నీరు అధికంగా చెరినప్పుడు వాపు కనిపిస్తుంది. మూత్రపిండాల వ్యాధిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణాల్లో పాదాల వాపు ఒకటి. గురుత్వాకర్షణ వల్ల నీరు పాదాల్లోకి చేరుతుంది. కొంతమందిలో కాసేపటికి సాధారణ స్థితికి చేరుతుంది కానీ కిడ్నీ వ్యాధి వచ్చే వారిలో మాత్రం అది దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది.

నెఫ్రాన్ కి నష్టం వాటిల్లడం వల్ల రక్తంలో ప్రోటీన్ అల్బుమిన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. ఫలితంగా వాపుకి కారణమవుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటే అల్బుమిన్ మూత్రంలోకి ప్రవేశించదు. శరీరంలో నీటిని నిలుపుకోవడం అనేది నెఫ్రోటిక్ సిండ్రోమ్, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లక్షణాలు.

కిడ్నీ వ్యాధి నిర్థారణ పరీక్షలు:

మూత్రపిండాల వ్యాధులని గుర్తించేందుకు రెండు రకాల పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. రక్తపరీక్ష చేస్తారు. క్రియేటినిన్ చూస్తారు. అది పెరిగిందంటే మూత్రపిండాల పనితీరు సరిగా లేదని అర్థం. మరొకటి మూత్ర పరీక్ష. మూత్రంలో అల్బుమిన్ స్థాయిలు చూస్తారు. కాళ్ళలో (Legs) ద్రవం పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. వెంటనే వైద్యులని సంప్రదించడం ముఖ్యం. కిడ్నీ వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి యూరిన్ టెస్ట్, అల్ట్రా సౌండ్ వంటి కొన్ని సాధారణ పరీక్షలు కూడా చేస్తారు.

యూరిన్ రంగుని బట్టి కూడా కిడ్నీల పనితీరు తెలుసుకోవచ్చు. యూరిన్ చెడు వాసన వస్తే ఇన్ఫెక్షన్ చేరిందని అర్థం శరీర అంతర్గత భాగాల్లో రక్తస్రావం కావడం వల్ల ఎరుపు రంగులోకి మూత్రం వస్తుంది. అలా ఉంటే కిడ్నీలో రాళ్ళు లేదా ఇన్ఫెక్షన్ వచ్చినట్టే. ముదురు గోధుమ రంగులోకి మారితే మాత్రం అది చాలా ప్రమాదకరం. గోధుమ రంగు మూత్రాశయం లేదా మూత్రపిండాల క్యాన్సర్ కి మొదటి సంకేతం. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ద్రవాలు బాగా తీసుకోవాలి. రోజుకి కనీసం 2, 3 లీటర్ల నీటిని తాగాలి. అతిగా తాగినా కూడా కిడ్నీలు దెబ్బతింటాయి.

Also Read:  Heart Attack: సైలెంట్ హార్ట్ ఎటాక్.. లక్షణాలు లేకుండానే ప్రాణాలు తీసే పెను ముప్పు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Consult
  • doctor
  • health
  • Immediately
  • Legs
  • Life Style
  • Swelling
  • tips
  • Tricks

Related News

Here is how you can tell if someone truly loves you!

True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

True Love: ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టే లేదా మీకు నచ్చనిది ఏమీ చేయరు. నిజమైన ప్రేమగల (True Love) వ్యక్తి మీ కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెతుకుతాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటిక

  • 7 Tips to Curb Insomnia for Stress Management

    Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd