Chicken 65: రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 ఇంట్లోనే చేసుకోండిలా?
మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకునే తింటూ ఉంటాం. చికెన్ బిర్యాని, చికెన్ నగ్గెట్స్, తందూరి చికెన్, చికెన్ దమ్ బిర్యాని,
- By Nakshatra Published Date - 08:40 PM, Wed - 13 September 23
మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకునే తింటూ ఉంటాం. చికెన్ బిర్యాని, చికెన్ నగ్గెట్స్, తందూరి చికెన్, చికెన్ దమ్ బిర్యాని, చికెన్ కబాబ్ ఇలా రకరకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే చాలామంది రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా చికెన్ 65 ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పుడు అలాంటి పదార్థాలు తినాలి అంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ చికెన్ 65 ఇంట్లోనా చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినవచ్చు. మరి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చికెన్ 65 రెసిపికి కావలసినవి :
బోన్ లెస్ చికెన్- 1 kg
గరం మసాలా – 50 గ్రాములు
అల్లంవెల్లుల్లి పేస్టు – 200 గ్రాములు
కార్న్ ఫ్లోర్ – 2 కప్పులు
మైదా – 1 కప్పు
కోడి గుడ్డు – 4
అజినొమొటొ – 2 స్పూన్స్
కారం – తగినంత
ఉప్పు – తగినంత
నూనె – సరిపడ
కరివేపాకు – కొన్ని
పచ్చిమిరపకాయలు – 10
రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు
పెరుగు – 2 కప్పులు
చికెన్ 65 రెసిపి తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో చికెన్,కార్న్ ఫ్లౌర్,మైదా, అల్లం వెల్లుల్లి పేస్టు,గరం మసాలా,కారం, ఉప్పు , కోడిగుడ్డు, రెడ్ కలర్,పెరుగు వేసి బాగ కలిపి గంటసేపు నానపెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని కాగాక అందులొ నానాపెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా అందులో వేసి వేయించాలి. ముక్కలను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆపై ఒక పాన్ లో కొంచం ఆయిల్ వేసి అందులొ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అందులొ వేసి బాగా వేగాక,నిమ్మరసం వేసి , వేయించిన చికెన్ ముక్కలను వేసుకుని ఒక ఐదు నిముషాలు వేగనివ్వాలి.
Related News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్ర�