Fruits: రాత్రిపూట పండ్లు తినవచ్చా?తినకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Fruits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీరానికి శక్తిని ఇచ్చే పండ్లను రాత్రి సమయంలో తినవచ్చో, తినకూడదో ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 09-12-2025 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా పండ్లను తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. అలాగే మన డైట్ లో చేర్చుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను రాత్రి సమయంలో తినవచ్చా తినకూడదా? ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రిపూట పడుకునే ముందు పండ్లు తినడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ ఏ పండ్లు తింటున్నాం అనేది ముఖ్యం అంటున్నారు. సరైన పండ్లను ఎంచుకోవడంతో పాటు సరైన పద్దతిలో కూడా తినాలట.
ముఖ్యంగా సులభంగా జీర్ణమయ్యేలా, తేలికగా శరీరానికి శక్తిని అందించేవి ఎంచుకోవాలని చెబుతున్నారు. అంటే యాపిల్, బొప్పాయి. పియర్స్, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లు రాత్రిపూట తినవచ్చట. ముఖ్యంగా బొప్పాయిలో ఉన్న ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని. ఇక రాత్రిపూట దానిమ్మ తినడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్రపడుతుందని, అలా అని మరీ ఎక్కువగా తీసుకోకూడదని, మితంగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లను రాత్రిపూట అస్సలు తినకూడదట. ముఖ్యంగా మామిడి పండు, అరటి పండు, ద్రాక్ష, సపోటా వంటి షుగర్ ఎక్కువగా ఉండే పండ్లు ఈ సమయంలో తినడం మంచిది కాదట. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను త్వరగా పెంచి, జీర్ణక్రియపై ఒత్తిడి పెంచుతాయట.
అదేవిధంగా నేరేడు లాంటి పండ్లు కూడా రాత్రిపూట కూడా తీసుకోకూడదని, ఎందుకంటె గ్యాస్, బ్లోటింగ్, కడుపు అసౌకర్యం కలిగే ప్రమాదం ఉందని, ముఖ్యంగా నిరంతరం అసిడిటీ, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లు అస్సలు తినకూడదని చెబుతున్నారు. పండ్లు తినే సమయానికి తోడు వాటిని ఎలా తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యంమట. రాత్రి పండ్లు తినాలంటే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం ఒక గంట తర్వాత తినాలట. అలాగే పండ్లతో చేసిన ఫ్రూట్ సలాడ్లు, మిక్స్ చేసిన పండ్లతో పాటు పాలు, పెరుగు కలిపి తినడం మంచిది కాదట. అలా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉందని,అందుకే జాగ్రత్తగా తినాలని, ఎక్కువ క్వాంటిటీలో రాత్రిపూట అస్సలు తినకూడదు. చిన్న బౌల్ లో మాత్రమే తినాలని చెబుతున్నారు. కాబట్టి రాత్రిపూట పండ్లు తినడం మంచిదే కానీ కేవలం కొన్ని రకాల పండ్లను మాత్రమే తీసుకోవాలని అవి కూడా మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.