Watermelon: పుచ్చకాయతో మీ చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోండిలా?
మామూలుగా మనకు వేసవికాలంలో పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిం
- By Nakshatra Published Date - 11:00 AM, Mon - 5 February 24
మామూలుగా మనకు వేసవికాలంలో పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వేసవిలో తరచుగా తీసుకోవాల్సిన వాటిలో పుచ్చకాయ కూడా ఒకటి.. అయితే ఈ పుచ్చకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా వేసవిలో వచ్చే అనేక చర్మ సమస్యలకు పుచ్చకాయ ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది చర్మ సమస్యలను దూరం చేయడంతోపాటు అందాన్ని రక్షిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి.
వీటితో పాటు పుచ్చకాయలోని లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు నిస్తేజంగా, కుంగిపోయిన చర్మాన్ని రీ ఫ్రెష్ చేస్తాయి. సన్‌బర్న్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. మరి పుచ్చకాయతో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో మనం తెలుసుకుందాం..పుచ్చకాయ జ్యూస్ తాగితే మన శరీరానికి ఎంత రీఫ్రెష్‌గా అనిపిస్తుందో చర్మాన్ని అంతే ఫ్రెష్‌గా చేస్తుంది. దీని హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇది బయట నుంచి ప్రకాశవంతమైన మెరుపును ఇస్తుంది. కాగా పుచ్చకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపల నుంచి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. పుచ్చకాయ జ్యూస్ తాగినా, మీ బ్యూటీ కేర్‌లో యాడ్ చేసుకున్న మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ చర్మం ఎప్పుడు తాజాగా కనిపిస్తూ ఉంటుంది. ఎండాకాలంలో చర్మం ఎక్కువగా ఎండకు గురికావడం వల్ల వడదెబ్బలు, చికాకు ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. పుచ్చకాయ విసుగు చెందిన చర్మాన్ని శాంతపరుస్తుంది. పుచ్చకాయ గుజ్జు మొటిమలపై అప్లై చేస్తే ఎరుపును తగ్గించి ఉపశమనం ఇస్తుంది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ పోరాడతాయి. ఇవి గీతలు, ముడతలను తగ్గించి చర్మాన్ని స్టిఫ్‌గా చేస్తాయి. పుచ్చకాయలోని పోషకాలు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి. పుచ్చకాయలో విటమిన్ A, B, C వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విటమిన్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి తోడ్పడతాయి.
చర్మంపై మచ్చలను తొలగిస్తాయి. పుచ్చకాయలలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది సేబాషియస్ గ్రంధులను ప్రేరేపిస్తుంది. తద్వారా సెబమ్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది. జుడ్డు చర్మంతో బాధపడేవారికి పుచ్చకాయ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. పుచ్చకాయ రసాన్ని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే చర్మంపై చికాకు, ఎరుపుదనం తగ్గుతుంది. అలాగే మీరు జిడ్డు చర్మంతో బాధపడుతుంటే పుచ్చకాయ గుజ్జు, టమాటాను మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. దీన్ని 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి శుభ్రం చేసుకోండి. పుచ్చకాయలోని మాలిక్ యాసిడ్, టమాటాలోని లైకోపీన్ సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేస్తాయి. చర్మంలో అధికంగా ఉన్న నూనెను తొలగిస్తాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు చర్మం సమస్య దూరం అవుతుంది.
Related News
Summer Foods : వేడి వేసవిలో మంచి జీర్ణక్రియ కోసం ఏమి తినాలి.?
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరగడంతో భారతదేశం తీవ్రమైన హీట్ వేవ్‌లో కొట్టుమిట్టాడుతోంది.