HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Benefits Of Watermelon Seeds Use For Health

Watermelon Seeds : పుచ్చకాయే కాదు పుచ్చ గింజలు కూడా ఆరోగ్యానికి మంచిదని తెలుసా??

ఎండాకాలంలో పుచ్చకాయని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అంతే కాకుండా మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే పుచ్చకాయలు కాదు పుచ్చ గింజలు(Watermelon Seeds) కూడా ఆరోగ్యానికి మంచివని మీకుతెలుసా?

  • Author : News Desk Date : 18-04-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Watermelon Seed
Watermelon Seed

ఎండాకాలం(Summer) వస్తే అందరికి గుర్తొచ్చేది మామిడి పండు(Mango)తో బాటు పుచ్చకాయ(Watermelon) కూడా. పుచ్చకాయ ఎండాకాలంలో మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో పుచ్చకాయని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అంతే కాకుండా మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే పుచ్చకాయలు కాదు పుచ్చ గింజలు(Watermelon Seeds) కూడా ఆరోగ్యానికి మంచివని మీకుతెలుసా?

ఇప్పటికీ కొన్ని ఆయుర్వేద షాపుల్లో పుచ్చ గింజలను, పుచ్చ గింజల పొడిని అమ్ముతూ ఉంటారు. పుచ్చ గింజల్లో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయ గింజలు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇందులో ఎముకలు బలంగా ఉండేందుకు కావాల్సిన క్యాల్షియం కూడా ఉంటుంది. పుచ్చ గింజలు తినడం వలన మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

అయితే వీటిని రెండు రకాలుగా తినొచ్చు. పుచ్చ గింజలను నూనె లేకుండా ఒక బౌల్ లో వేయించి, వాటి పొట్టు తీసి డైరెక్ట్ గా తినొచ్చు. అంతే కాక అలా పొట్టు తీసిన పుచ్చ గింజలను మిక్సీ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని స్వీట్స్, పాలల్లో కలుపుకొని తాగొచ్చు. కొన్ని స్వీట్ షాప్స్ వాళ్ళు పుచ్చ గింజలను, పుచ్చ గింజల పొడిని కూడా స్వీట్స్ తయారీలో వాడుతారు.

అలాగే వీటితో టీ కూడా చేసుకొని తాగొచ్చు. పుచ్చ గింజల టీ వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. పుచ్చ గింజలను డైరెక్ట్ గా నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ నీళ్ళని వడబోసి తాగొచ్చు. లేదా పుచ్చ గింజలను ఎండలో బాగా ఎండబెట్టి, అనంతరం వాటిని పొడి చేసి ఆ పొడిని నీళ్ళల్లో బాగా మరిగించి, వడపోసి టీలాగా తాగొచ్చు. ఆ పొడి కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇలా పుచ్చ గింజల టీ తాగడం వల్ల కండరాల కదలికలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. కాబట్టి ఇకనుంచి పుచ్చకాయతో పాటు పుచ్చ గింజలను కూడా ఆహారంగా అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని పొందండి.

 

Also Read :    Pains while Working : కంప్యూటర్ పనితో ఆ నొప్పులతో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఇలా చేయండి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefits of Watermelon Seeds
  • summer
  • watermelon
  • Watermelon Seeds

Related News

10 Natural Remedies to Stop Hair Fall

Hair Fall: ఎండాకాలంలో జుట్టు రాలుతోందా?…ఈ సహజ సిద్ధ పదార్థాలతో చెక్ పెట్టండి..!!

ఎండాకాలం మొదలైంది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ క్రమంలో జుట్టుపై శ్రద్ధ, శుభ్రత చాలా అవసరం. సాధారణంగా వేసవిలో జుట్టు సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఈ సీజన్లో వేడి, చెమట కారణంగా జుట్టు జిడ్డుగా మారుతుంది. హానికరమైన అతినీలలోహిత కిరణాల కారణంగా జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. ఈ సీజన్లో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యకరమైన, అందమైన జుట

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd