Fenugreek: షుగర్, కొలెస్ట్రాల్, అధిక బరువు సమస్యలు దూరం అవ్వాలంటే మెంతులతో ఈ విధంగా చేయాల్సిందే?
Fenugreek: అధిక బరువు, కొలెస్ట్రాల్, షుగర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మెంతులతో ఇప్పుడు చెప్పినట్టు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 07:30 AM, Thu - 9 October 25

Fenugreek: మన వంటింట్లో దొరికే వాటిలో మెంతులు కూడా ఒకటి. మెంతుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. మెంతుల్లో రిచ్ డైటరీ ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, ఐరన్, మాంగనీస్, కాపర్‌లు ఉంటాయి. వీటిలో బి విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి మేలు చేస్తాయట. కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చట.
మరి ఇంతకీ మెంతులను ఎవరు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రక్తంలో గ్లూకోజ్‌ని కంట్రోల్ చేయడంలో మెంతులు చాలా చక్కగా పనిచేస్తాయట. వీటిని తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని, భోజనం తిన్న రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. వీటిని తిన్నవారితో పోలిస్తే తిననివారి బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటుందట. మెంతుల్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయట. అలాగే మెంతులు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుందట. దీని వల్ల జీర్ణవయాంతర సమస్యలు తగ్గుతాయని, మెంతుల్లోని ఫైబర్, శ్లేష్మం కారణంగా కడుపు పొరశాతపరిచి, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట తగ్గుతుందని,ఈ విత్తనాలు జీర్ణ ఎంజైమ్స్ స్రావాన్ని కూడా పెంచుతాయట.
దీంతో జీర్ణక్రియ పెరుగుతుంది. మెంతుల నీరు, విత్తనాలని రెగ్యులర్‌గా తీసుకుంటే ఉబ్బరం, ఆపాన వాయువు, కడుపు తిమ్మిర్లు తగ్గుతాయట. మెంతులు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. దీని వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. మెంతుల్లోని సపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ కలిగి ఉంటాయట. ఇవి ప్రేగుల్లో కొలెస్ట్రాల్ శోషణని నిరోధించడంలో హెల్ప్ చేస్తాయట. హై ఫైబర్ కారణంగా పిత్త లవణాలు తొలగిపోతాయట.
కాలేయం కొలెస్ట్రాల్ సహాయంతో ఎక్కువ పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుందట. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయని చెబుతున్నారు. డయోస్జెనిన్, ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్ వంటి సమ్మేళనాల కారణంగా మెంతులు క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయట. ఈ బయోయాక్టివ్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అందుతాయట. ఇవి ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేసి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. మెంతుల్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే మరో ముఖ్య లాభం ఆకలి తగ్గుతుందట. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి హెల్ప్ అవుతుందట. మెంతుల్లోని కరిగే ఫైబర్ ఉబ్బి కడుపులో జెల్ ని ఏర్పరుస్తుందట. దీంతో కడుపు నిండుతుందని, మొత్తం కేలరీలని తక్కువగా తీసుకుంటారట.