Alcohol : ఆల్కహాల్ సేవిస్తూ మర్చిపోయి కూడా వీటిని తినకండి… !!!
- By hashtagu Published Date - 10:41 PM, Thu - 3 November 22

పెగ్గేయ్యాలంటే…స్టఫ్ ఉండాల్సిందే. స్టఫ్ లేకుండా మద్యం తాగుతే మజా ఉండదు. అందుకే చాలా మంది స్నాక్స్, చిప్స్ , వేయించిన వేరశనగలు లేదా జీడిపప్పు తింటుంటారు. వీటిలో అధిక సోడియం,కొలెస్ట్రాల్ ఉంటాయన్న సంగతి మీకు తెలుసా. వీటిని ఆల్కాహాల్ తో అస్సలు తినకూడదు. ఆల్కాహాల్ తో పాటు వీటిని తింటే కడుపులో విషంగా మారి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిప్స్, పిజ్జా, చికెన్, ఫ్రైస్ ఇవన్నీ ఆల్కాహాల్ తోపాటు తీసుకుంటే మీ ఆరోగ్యం మీచేతులతోనే పాడుచేసుకున్నట్లు అవుతుంది. అసలు ఆల్కాహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. దానితోపాటు వీటిని తినడం వల్ల శరీరానికి మరింత హాని కలుగుతుంది. వీటిలో అధిక సోడియం ఉంటుంది. ఆల్కాహాల్ తోపాటు వీటిని తీసుకున్నట్లయితే…దీర్ఘకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి ఆహార పదార్థాల్లో ఉప్పు తోపాటు నూనె మసాలాలు అధికంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని అనారోగ్యం బారినపడేలా చేస్తాయి. ఆల్కహాల్ తోపాటు ఈ హానికరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో పోషకాలను గ్రహించే ప్రక్రియ క్రమంగా తగ్గిపోతుంది. అందుకే మద్యంతోపాటు ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
ఇవే కాకుండా వైన్ తోపాటు పందిమాంసం, చీజ్ అస్సలు తినకూడదు. ముఖ్యంగా మీకు ఎసిడిటి ఉన్నట్లయితే…వీటికి చాలా దూరంగా ఉండాలి. ఏదైనా తినాలి అనుకుంటే ప్రొటిన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.
కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్ లలో ఈస్ట్ ఉంటుంది. ఆల్కాహల్లో కూడా ఈస్ట్ ఉంటుంది. దీన్ని అధిక పరిమాణంలో తీసుకుంటే కడుపు దానిని జీర్ణించుకోలేదు.
మీకు రోజు బీర్ కానీ వైన్ కానీ తాగే అలవాటు ఉంటే…పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఆల్కహాల్ తోపాటు పాల ఉత్పత్తులు తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. కెఫిన్, కోకో, ఆల్కాహాల్ తో తీసుకోకూడదు. ఇది కడుపునొప్పికి దారి తీస్తుంది. స్వీట్లు తినాలనిపిస్తే…చాక్లెట్, నెయ్యి తో కూడిన స్వీట్స్ కు బదులుగా శనగపిండితో చేసినవి తినండి. వేరుశనగలు, బర్గర్ లు ప్రైలు వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిలో అధికంగా సోడియం ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను పాడుచేస్తాయి.