HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Be Safe With Dogs More Danger In This Season Follow These Precautions

Dogs: ఈ సీజన్‌లో కుక్కలతో జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్తలు పాటించండి

సాధారణంగా కుక్క కాటు కేసులు ఎక్కువగా వేసవిలోనే కనిపిస్తాయి? కుక్కలు ఇలా వేసవిలోనే

  • Author : Maheswara Rao Nadella Date : 23-02-2023 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Be Safe With Dogs More Danger This Season, Follow These Precautions
Be Safe With Dogs More Danger This Season, Follow These Precautions

హైదరాబాద్‌లోని అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల (Dogs) దాడిలో మరణించిన ఘటన ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఆ సమయంలో పిల్లాడి ఎంత బాధను అనుభవించి ఉంటాడనే బాధ ప్రతి ఒక్కరినీ వెంటాడింది. ఆ పిల్లాడి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదంటే.. కనీస జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా వదలకూడదు. సాధారణంగా కుక్క కాటు కేసులు ఎక్కువగా వేసవిలోనే కనిపిస్తాయి? అసలు ఎందుకు కుక్కలు (Dogs) ఇలా వేసవిలోనే పేట్రేగిపోతాయి? ఇందుకు కారణం ఏమిటీ కుక్క కరిస్తే ఏం చెయ్యాలి? తదితర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎండాకాలంలో ఎండ వేడి వల్ల కుక్కలు చాలా చికాకు పడుతుంటాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. ఆ మాటకు ఊతమిస్తున్నట్టే నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో కుక్కకాటుకు గురై చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందట. దాదాపుగా 250 నుంచి 300 మంది కుక్కకాటు చికిత్స కోసం వేసవిలో ప్రతి రోజు వస్తుంటారని అక్కడి అధికారులు అంటున్నారు.

మనుషుల లాగే కుక్కలు కూడా వేసవిలో వేడి తట్టుకోలేవని అందువల్ల కుక్కలు చాలా దూకుడుగా ఉంటాయని ‘సైకాలజీ టుడే’ అనే మ్యాగజైన్ కామెంట్ చేస్తోంది. వేసవిలో తిండి, నీళ్లు తగినంత దొరకనందువల్లే కుక్కల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల వీధికుక్కలు ఎక్కువ మందిని కరుస్తాయట. వీధి కుక్కలు మాత్రమే ఇలా ఉంటాయనుకుంటే తప్పే. పెంపుడు కుక్కల్లో కూడా 28 శాతం వరకు వేసవిలో ఇలా అగ్రెసివ్ గా ఉంటాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. వేసవిలో వీలైనంత వరకు కుక్కలకు దూరంగా ఉండడమే మంచిది. పెంపుడు కుక్కలైతే డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేయించి జాగ్రత్తగా చూసుకోవాలి. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే.. మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేదా వాటి కోసం ప్రత్యేకంగా నీరు అందుబాటులో ఉంచాలి. దానివల్ల అవి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటాయి. ప్రజలు కూడా సేఫ్.

కుక్క (Dogs) కరిస్తే ఏం చేయాలి?

కుక్క కాటు చిన్నగా ఉన్నపుడు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. కానీ డాక్టర్ ను తప్పనిసారిగా డాక్టర్ ను సంప్రదించాలి. కుక్కకాటు గాయాలు చాలా బలంగా, పెద్దగా ఉన్నపుడు అత్యవసర చికిత్స అవసరం అవుతుంది. కుక్కకాటు గాయాన్ని వెంటనే నీటితో శుభ్రపరచాలి, పదినిమిషాల పాటు ధారగా పడుతున్న నీటి కింద గాయాన్ని కడగాలి. తర్వాత రెండు మూడు చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో కడగాలి. శుభ్రమైన గుడ్డతో గాయాన్ని సున్నితంగా తుడవాలి. అందుబాటులో ఉన్న యాంటీ బయోటిక్ క్రీమ్ రాయాలి. స్టెరైల్ బ్యాండేజ్‌ని గాయం చుట్టూ గట్టిగా కాకుండా కట్టాలి.

లోతైన గాయాలైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. గాయాన్ని డాక్టర్ పరిశీలించాక బ్యాండేజ్‌ని రోజుకు కనీసం మూడుసార్లైనా మార్చుతూ ఉండాలి. గాయాన్ని గమనిస్తూ ఉండాలి. దురద వస్తుందా, ఎర్రగా అవుతోందా, చెమట పడుతోందా, నొప్పి పెరుగుతోందా, జ్వరం వస్తోందా వంటివి గమనిస్తూ డాక్టర్ సలహాలు పాటించాలి. వెంటనే గాయాలకు చికిత్స అందించకుంటే చాలా రకాల ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. కొన్ని సార్లు రేబీస్ వంటి ప్రాణాంతక ప్రమాదాలకు కుక్కకాటు కారణం అవుతుంది. కనుక రేబీస్ సోకకుండా యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఇస్తారు. కరిచిన కుక్కను బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. గాయం మానడానికి 7 రోజుల నుంచి కొన్ని నెలలు పట్టవచ్చు.

ఇన్ఫెక్షన్ సోకిందని ఎలా తెలుసుకోవాలి?

కుక్క కరిచిన చోట తీవ్రమైన నొప్పి, వాపుతో పాటు గాయం చుట్టూ ఎర్రగా మారుతుంది. ఈ గాయం నుంచి ఆగకుండా రక్తస్రావం అవుతుంది. చీము కూడా పట్టొచ్చు. గాయం చుట్టూ తిమ్మిరిలా అనిపిస్తుంది. జ్వరం, తల తిరగడం, చెమట ఎక్కువగా పోయడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానించాల్సిందే. కాబట్టి కుక్క కరిచిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.

Also Read:  High Cholesterol: ఈ టిప్స్‌ ఫాలో అయితే అధిక కొలెస్ట్రాల్‌ త్వరగా కరుగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Danger
  • dogs
  • Follow
  • Life Style
  • precautions
  • Safe
  • season
  • tips
  • Tricks

Related News

    Latest News

    • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

    • రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!

    • టీ20 క్రికెట్ చరిత్ర.. ఒకే సిరీస్‌లో అన్ని టాస్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    Trending News

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd