Dry & Rough Skin Tips : చర్మం పొడి భారీ గరుకుగా మారిందా ఇబ్బంది పడుతున్నారా..? అయితే ప్రతిరోజు ఈ జ్యూస్ తాగాల్సిందే..
శీతాకాలం చర్మం మొత్తం పగిలి పొడిబారడం (Dry Skin) నిర్జీవంగా అయిపోవడం మంటగా అనిపించడం లాంటివి కూడా ఒకటి.
- By Naresh Kumar Published Date - 03:01 PM, Tue - 2 January 24

Tips for Dry and Rough Skin : శీతాకాలం మొదలైంది అంటే చాలు ఎన్నో రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అందులో చర్మ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఒకటి. మరి ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సమస్యలు మరింత వేధిస్తూ ఉంటాయి. శీతాకాలం చర్మం మొత్తం పగిలి పొడిబారడం (Dry Skin) నిర్జీవంగా అయిపోవడం మంటగా అనిపించడం లాంటివి కూడా ఒకటి. దీంతో ఆ సమస్య నుంచి బయటపడడం కోసం చాలామంది అనేక రకాల మాయిశ్చరైజర్ లు ఉపయోగిస్తూ ఉంటారు. కని హెవీ మాయిశ్చరైజర్లు కూడా చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచలేవు.
తరచూ క్రీమ్‌లను అప్లై చేయడం వల్ల చర్మం ముదురు రంగులో కనిపిస్తుంది. చలికాలంలో చర్మం తాజాగా ఉండాలంటే డైట్‌పై దృష్టి పెట్టాలి. సమతుల్య ఆహారం చర్మం తగినంత పోషకాలను పొందడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. మరి చలికాలం ఇలాంటి సమస్యలు రాకూడదంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
చలికాలంలో నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను నీరు బయటకు పంపుతుంది. చలికాలంలో చల్లని వాతావరణం కారణంగా చాలామంది తక్కువగా నీరు తాగుతూ ఉంటారు. అలా చేయకుండా శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం వల్ల మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్చిపోతాయి. అలాగే తగినంత నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. శీతాకాలపు ఆహారంలో క్యారెట్ లను చేర్చుకోవాలి. క్యారెట్ లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఇతర పోషకాలు ఉంటాయి. ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ ప్రతి రోజూ తాగితే పర్ఫెక్ట్ స్కిన్ పొందుతారు. అలాగే నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండు తింటే చర్మ సమస్యలు దరచేరవు.
అదేవిదంగా చలికాలంలో పాలకూర తినడం అస్సలు మర్చిపోకూడదు. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఈ హెర్బ్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ విత్తనాలు తినడం వల్ల చర్మంపై యాంటీ మైక్రోబియల్ ప్రభావం ఉంటుంది. ఇది మొటిమల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అలాగే దానిమ్మ రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం తాజాగా మారుతుంది.