HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Are You Troubled By Nerve Weakness

Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are you troubled by nerve weakness
Are you troubled by nerve weakness

మన శరీరానికి నరాలు ఎంతో ముఖ్యమైనవి. అవి బలహీనపడితే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతుంది. నేటి ఆధునిక కాలంలో పోషకాహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నరాల పటుత్వం తగ్గి చిన్న వయసులోనే నీరసం, తిమ్మిర్లు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి ఖరీదైన చికిత్సల కంటే మన వంటింట్లో ఉండే వాము, లవంగాలు, దాల్చినచెక్క అద్భుతమైన పరిష్కారం చూపుతాయని, నరాల వ్యవస్థను తిరిగి ఉత్తేజపరుస్తాయని పెద్దలు చెబుతారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

వేగవంతమైన లైఫ్‌ స్టైల్‌, పని ఒత్తిడి, పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో చాలామంది ప్రస్తుతం నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కాళ్లు చేతులు తిమ్మిర్లు, నీరసం, నరాలు లాగినట్లు అనిపించడం వంటి లక్షణాలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే ఖరీదైన మెడిసిన్స్‌పై ఆధారపడకుండా మొదట మన వంటింట్లో అందుబాటులో ఉండే వాము, లవంగాలు, దాల్చినచెక్క వంటి సహజమైన పదార్థాలతో నరాల సమస్యను దూరం చేసుకోవచ్చని మన అమ్మమ్మ కాలం నుంచి పెద్దలు చెబుతూనే ఉన్నారు.

అంతే కాకుండా ఈ వాము, లవంగాలు, దాల్చినచెక్క నరాల వాపును, నొప్పిని నివారించడంలో దోహదపడతాయని NLM అధ్యయనం సైతం పేర్కొంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, రక్త ప్రసరణను పెంచే గుణాలు నరాలకు తిరిగి జీవం పోస్తాయి. అయితే వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించడం కూడా ముఖ్యం. ఈ కథనంలో మనం వాము, లవంగాలు, దాల్చినచెక్క నరాల బలహీనతను ఎలా తగ్గిస్తాయి, వీటిని ఎలా వాడాలి అనే విషయాలను తెలుసుకుందాం.

నరాల బలహీనతకి వాము

  • వాము శరీరంలో రక్త ప్రసరణరు వేగవంతం చేసి నరాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ అందేలా చేస్తుంది.
  • వాములో ఉండే థైమోల్‌ అనే మూలకం నరాల వాపును, తీవ్రమైన నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • ఆయుర్వేదం ప్రకారం వాము నరాల సమస్యలకు ముఖ్య కారణమైన వాత దోషాన్ని అదుపు చేయడంలో బాగా పనిచేస్తుంది.
  • వాము కషాయం తాగడం వల్ల నరాలు ఉత్తేజితమైన కాళ్లు, చేతుల తిమ్మిర్లు తగ్గుతాయి.
  • వాము ఆయిల్‌తో నరాల బలహీనత ఉన్న చోట మర్దన చేయడం వల్ల కండరాలు బలపడుతాయి.

నరాల బలహీనతకి లవంగాలు

నరాల బలహీనతను తగ్గించడంలో లవంగాలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని రీసెర్చ్‌ గేట్‌ అధ్యయనం పేర్కొంది. లవంగాల్లో ఉండే యుజినోల్‌ అనే ఎంజైమ్‌ సహజ సిద్ధమైన నొప్పి నివారిణిగా పనిచేసి నరాల వాపును తగ్గిస్తుంది. లవంగాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా నరాలకు సరిపడినంత ఆక్సిజన్‌ను అందించి తిమ్మిర్లు, నరాల ఒత్తిడిని అదుపు చేస్తాయి. అలాగే లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ నరాల కణాలు దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖ్యంగా లవంగాలు షుగర్‌ వల్ల వచ్చే నరాల బలహీనతను అరికట్టడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

నరాల బలహీనతకి దాల్చినచెక్క

దాల్చినచెక్క రక్తనాళాలను వ్యాకోచింపజేసి నరాలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నరాల వాపును, నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మెదడులోని న్యూరాన్ల రక్షణకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా నరాలు మొద్దుబారకుండా ఉంటాయి. అలాగే రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేసి డయాబెటిక్‌ న్యూరోపతి వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలి?

20 గ్రాముల వాము పొడి, లవంగాలు దోరగా వేయించి వాటిని పొడి చేసుకుని వాటి చూర్ణం 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం కూడా 20 గ్రాములు తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. దీనిని రోజూ ఉదయం, రాత్రి తీసుకోవాలి. ఎలాగంటే.. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము ఈ మిశ్రమాన్ని కలుపుకుని తాగాలి. అయితే ఈ పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది. కాబట్టి 1 గ్రాము సరిపోతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వాము, దాల్చిన చెక్క, లవంగాలు వేడి స్వభావాన్ని కలిగినవి కాబట్టి మోతాదు మించకుండా చూసుకోవాలి.
  • గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు ఇచ్చే ముందు డాక్టర్ల సలహా తీసుకోండి.
  • నరాల బలహీనత బాగా ఎక్కువగా ఉండి తిమ్మిర్లు, నడవలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కేవలం ఇంటి చిట్కాల మీద ఆధారపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Best Home Remedies
  • health care
  • health tips
  • Nerve Health
  • Nerve Weakness

Related News

Weight Loss

Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

మామూలుగా బరువు పెరగడం అన్నది చాలా ఈజీ. కానీ బరువు తగ్గడం అన్నది మాత్రం అంత సులువైన విషయం కాదని చెప్పాలి. బరువు తగ్గడం కోసం రకరకాల ఎక్సర్సైజులు చేయడం, జిమ్ లో వర్కౌట్ చేయడం, వాకింగ్ చేయడం, డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు బరువు తగ్గరు. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే బరువ

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd