HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Are You Spending All The Money You Earn Follow These Tips To Save Money

Life Style : సంపాదించిన డబ్బులన్నీ ఖర్చైపోతున్నాయా? పొదుపు ఎలా చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

చాలామంది ఎంత సంపాదించినా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ లేదని బాధపడుతుంటారు. దీనికి కారణం తక్కువ సంపాదన కాదు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం.

  • By Kavya Krishna Published Date - 05:28 PM, Mon - 23 June 25
  • daily-hunt
Govt Scheme
Govt Scheme

Life Style : చాలామంది ఎంత సంపాదించినా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ లేదని బాధపడుతుంటారు. దీనికి కారణం తక్కువ సంపాదన కాదు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం. పొదుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు, భవిష్యత్తు కోసం ఒక బలమైన పునాది వేయడం. అనూహ్య ఖర్చులు, దీర్ఘకాలిక లక్ష్యాలు (ఇల్లు కొనడం, పిల్లల చదువులు, రిటైర్మెంట్) సాధించాలంటే పొదుపు తప్పనిసరి. మరి పొదుపు ఎలా ప్రారంభించాలి? అందుకు సంబంధించిన చిట్కాలను ఇలా తెలుసుకోండి

మొదటి అడుగు మీ ఖర్చులను ట్రాక్ చేయడం..

ప్రతి నెలా మీరు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకోండి. దీనికోసం ఒక డైరీలో రాసుకోవచ్చు లేదా బడ్జెటింగ్ యాప్‌లు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ’50/30/20 రూల్’ పాటించవచ్చు: 50% ఆదాయం అవసరాలకు (అద్దె, ఆహారం), 30% కోరికలకు (వినోదం, షాపింగ్), 20% పొదుపు లేదా రుణాల చెల్లింపులకు కేటాయించండి. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులను గుర్తించి తగ్గించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడుల కోసం 50 శాతం కేటాయించినా తప్పులేదు. ఎందుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అనుకోకుండా అనారోగ్యం బారిన పడితే మీ సేవింగ్స్ ఒకే దెబ్బకు అయిపోవచ్చు. అందుకే సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం చాలా అవసరం.

YSRCP Yuvatha Poru : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైస్సార్సీపీ ‘యువత పోరు’

పొదుపును అలవాటుగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. ప్రతినెలా జీతం రాగానే నిర్ణీత మొత్తాన్ని నేరుగా పొదుపు ఖాతాలోకి బదిలీ చేయండి. దీనిని ‘మిమ్మల్ని మీరు ముందుగా చెల్లించుకోవడం’ అంటారు. దీనివల్ల మీరు ఖర్చు చేయడానికి ముందుగానే పొదుపు చేస్తారు. అలాగే, చిన్న చిన్న ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయటి భోజనం తగ్గించడం, అనవసరమైన సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేసుకోవడం వంటివి కూడా పెద్ద మొత్తంలో పొదుపు చేయడానికి దోహదపడతాయి. ఆన్‌లైన్ షాపింగ్‌లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

చివరగా, మీ పొదుపు లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోండి. ఒక కారు కొనడమా, లేదా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమా? లక్ష్యం స్పష్టంగా ఉంటే పొదుపు చేయడానికి మరింత ప్రేరణ లభిస్తుంది. అలాగే, పొదుపు చేసిన డబ్బును వృద్ధి చెందేలా పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించండి. బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి మీ డబ్బు విలువను పెంచుతాయి. క్రమశిక్షణతో కూడిన ఈ అలవాట్లు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తాయి.

Murder of Husband : పెళ్లైన నెలకే భర్తను హత్య చేయించిన భార్య…ఛీ అసలు ఆడదేనా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • as per preplan
  • expenditure
  • how to save money
  • Investments
  • lifestyle
  • no savings
  • tips

Related News

World AIDS Day

World AIDS Day: హెచ్ఐవీ తొలి లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఎందుకు తప్పనిసరి?

ఎయిడ్స్ సోకినప్పుడు శరీరంలో కనిపించే ప్రారంభ లక్షణాలు ఏమిటో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం. AIDS సోకినప్పుడు కనిపించే మొదటి లక్షణాలలో ఒకటి నాలుకపై తెల్లటి పూత ఏర్పడటం. ఇది సులభంగా పోదు లేదా తొలగించబడదు.

  • Stomach Worms

    Stomach Worms: మీ పిల్ల‌ల క‌డుపులో నులిపురుగులు ఉంటే తెలుసుకోండిలా?!

  • Eggs

    Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో పెట్ట‌డం మంచిదేనా?

  • Vayu Mudra

    Dry Lips: పెదాల పగుళ్లు, పొడిబారడం సమస్యకు చెక్ పెట్టండిలా!

  • Health Tips

    Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

Latest News

  • Mrunal Dating : డేటింగ్ వార్తలపై మృణాల్ ఫుల్ క్లారిటీ

  • AI University : రెండు నెలల్లో AI యూనివర్సిటీ ప్రారంభం – శ్రీధర్ బాబు

  • Avatar 3 Tickets: ‘అవతార్ 3’ టికెట్ బుకింగ్స్‌ తేదీ ఖరారు!

  • KCR : పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు – సీఎం రేవంత్

  • High Court Notice : రేవంత్ సర్కార్ కు హైకోర్టు నోటీసులు

Trending News

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

    • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd