Murder of Husband : పెళ్లైన నెలకే భర్తను హత్య చేయించిన భార్య…ఛీ అసలు ఆడదేనా..?
Murder of Husband : తేజేశ్వరరావును ల్యాండ్ సర్వే పేరుతో పాణ్యం వద్దకు రప్పించి, కారులో తీసుకెళ్లి గొంతు కోసి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది
- Author : Sudheer
Date : 23-06-2025 - 1:49 IST
Published By : Hashtagu Telugu Desk
రోజు రోజుకు ఆడవారి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకొని తాళికట్టిన భర్తనే కాదు కడుపున పుట్టిన పిల్లల్ని కూడా హతమారుస్తున్నారు. మొన్నటికి మొన్న మేఘాలయాలో హనీమూన్ కు వెళ్లి అక్కడ కట్టుకున్న భర్తనే హత్య చేయించి వార్తల్లో నిలుస్తే..ఇప్పుడు తెలంగాణ లో కూడా ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే వివాహం చేసుకున్న గద్వాలకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి తేజేశ్వరరావు కొద్ది రోజుల క్రితం కర్నూలుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. మిస్సింగ్‌గా ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా, అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వరరావును అతని సొంత భార్య, ఆమెతో సంబంధం ఉన్న బ్యాంకు మేనేజర్ తిరుమలరావు కలిసి హత్య చేశారని తేలింది.
Chevireddy Bhaskar Reddy : మరింత చిక్కుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ
తేజేశ్వరరావును ల్యాండ్ సర్వే పేరుతో పాణ్యం వద్దకు రప్పించి, కారులో తీసుకెళ్లి గొంతు కోసి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం అతని మృతదేహాన్ని పిన్నాపురం చెరువు వద్ద పడేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. హత్య అత్యంత కిరాతకంగా జరిగిందని వెల్లడైంది. తేజేశ్వరరావు భార్య, బ్యాంకు మేనేజర్ తిరుమలరావు, మరియు ఆమె తల్లి ఈ పథకంలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, మిగిలిన వారికి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మృతుడి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. తన తమ్ముడి భార్య ముందే ప్రేమ వ్యవహారం పెట్టుకుందని, పెళ్లికి ముందు వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని తెలిపాడు. తరువాత మళ్లీ తన తమ్ముడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నదని పేర్కొన్నాడు. పెళ్లి అయిన నెల రోజుల్లోనే కుట్ర పన్ని హత్య చేసిందని, ఆమె మొహంలో అస్సలు బాధ కనిపించలేదని తెలిపాడు.