Chicken Bone: చికెన్ ఎముకలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
Chicken Bone: చికెన్ లో ఎముకలు ఇష్టంగా తినేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని, లేదంటే కొన్ని రకాల సమస్యలు తప్పవని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Sat - 18 October 25

Chicken Bone: మాంసం ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో చికెన్ ఒకటి. కొంతమంది నాటుకోడి చికెన్ ఇష్టపడితే మరికొందరు బాయిలర్ కోడి ఇష్టపడుతూ ఉంటారు. అయితే నాటు కోళ్ల సంగతి పక్కన పెడితే ఈ బ్రాయిలర్ కోళ్లను మాంసం కోసం పెంచుతారు. వీటిని త్వరగా పెద్ద చేయడకోసం హార్మోన్లు, యాంటీ బయాటిక్స్ తో కూడిన ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి బ్రాయిలర్ కోడి మాంసాన్ని తినడం మాత్రమే కాకుండా ఎముకలు కూడా రుచిగా ఉన్నాయని బాగా నమిలే తింటూ ఉంటారు.
అయితే అలాంటి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు. కాగా బ్రాయిలర్ కోడి ఎముకలు తినడం ఏమాత్రం మంచిది కాదట. ఎందుకు అంటే ఇవి వేగంగా పెరగడానికి కావలసిన హార్మోనల్ ఇంజక్షన్స్ ఇవ్వడం వలన, ఆ హార్మోనల్ ఇంజక్షన్ల ప్రభావం వాటి ఎముకల పైన ఉంటుంది. ఎప్పుడైతే బ్రాయిలర్ కోడితో పాటు ఎముకలు తింటారో అటువంటివారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి ఎముకలు మన శరీరానికి హాని చేస్తాయట. కాగా కృత్రిమంగా పెంచిన కోళ్ళ ఎముకలు తినడం కారణంగా బరువు విపరీతంగా పెరుగుతారట.
మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని, ఇక వీటిలో పోషక విలువలు తక్కువగా ఉండటం వల్ల వీటిని తినడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. బ్రాయిలర్ కోళ్లలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. చికెన్ ఎముకలను తినడం వల్ల కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ ఎముకలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో పేగులలో అడ్డంకులు లేదా గాయాలకు కారణమవుతుందట.
చికెన్ ఎముకలు తినే సమయంలో మరో ప్రమాదం కూడా ఉంటుందని, పొరపాటున గొంతులో ఇరుక్కుపోతే అనవసరమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని, కొన్నిసార్లు శ్వాసనాళంలో చికెన్ ముక్క ఇరుక్కుపోయి ప్రాణాలు పోయే సందర్భాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. చాలామంది కోడి ఎముకలలో ఉన్నటువంటి మూలుగను తినడానికి ఇష్టపడతారు. అయితే నాటుకోడి మజ్జ తింటే పర్వాలేదు కానీ, బాయిలర్ కోడి మజ్జ తింటే మాత్రం లేని పోనీ అనారోగ్య సమస్యలు రావడం ఖాయం అని చెబుతున్నారు.