Mobile Addict: మీరు ఫోన్ కు అడిక్ట్ అయ్యారా.. అయితే బీ కేర్ ఫుల్
- By Balu J Published Date - 06:25 PM, Fri - 26 April 24

Mobile Addict: కొద్దిసేపు ఫోన్‌కి దూరంగా ఉంటే చాలామందిలో వణుకు మొదలవుతుంటుంది. చెమటలు పట్టడం, తెలియని భయం ఉంటుంది. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ప్రతి చిన్న, పెద్ద పనికి మనం దానిపై ఆధారపడుతున్నాం. ఒక్క క్షణం కూడా ఫోన్‌కు దూరంగా ఉండటమే కష్టంగా తయారైంది పరిస్థితి. మొబైల్ ఫోన్ దగ్గర లేకుంటే ఆందోళన కూడా మొదలవుతుంది. ఇలాంటి సమస్యను తేలికగా తీసుకోకూడదు. వైద్య పరిభాషలో దీనిని నోమోఫోబియా అంటారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత.
మొబైల్ దగ్గర లేకపోతే ఆందోళన అనుభవించడం ప్రారంభమవుతుంది.శ్వాసలో మార్పు ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆందోళన మరియు ఒత్తిడి కాకుండా, నోమోఫోబియా యొక్క అనేక ఇతర లక్షణాలు ఉండవచ్చు. నోమోఫోబియా ఇంకా అధికారికంగా మానసిక రుగ్మతగా పరిగణించబడలేదు, కాబట్టి దీనికి చికిత్స అందుబాటులో లేదు. అయితే, ఈ ఫోబియాను కొన్ని రకాల థెరపీ, కౌన్సెలింగ్‌తో అధిగమించవచ్చు.