HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >5 Orthopedic Problems In Children

Orthopedic Problems in Children: పిల్లలకు వచ్చే 5 ఆర్థోపెడిక్ సమస్యలు

టీనేజ్ (Teen Age) అనేది పిల్లలు ఎదిగే వయసు. ఎంతో ముఖ్యమైనది. ఈ టైంలో పిల్లలపై

  • Author : Maheswara Rao Nadella Date : 19-02-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
5 Orthopedic Problems In Children
5 Orthopedic Problems In Children

టీనేజ్ అనేది పిల్లలు ఎదిగే వయసు. ఎంతో ముఖ్యమైనది. ఈ టైంలో పిల్లలపై పేరెంట్స్ శ్రద్ధ కొంచెం ఎక్కువే ఉండాలి. టీనేజ్ లో కొందరు పిల్లలకు ప్రధానంగా 5 సాధారణ ఆర్థోపెడిక్ సమస్యలు (Orthopedic Problems) వస్తుంటాయి.వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయించాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంటుంది. లేకపోతే పిల్లల బాడీ పెరుగుదలపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది.

టీనేజ్ పిల్లల్లో వచ్చే 5 సాధారణ ఆర్థోపెడిక్ సమస్యలు (Orthopedic Problems) ఇవీ

1. ఓస్గుడ్ స్క్లాటర్ వ్యాధి (Osgood Schlatter)

ఇది పెరుగుతున్న పిల్లలలో సంభవించే ఒక రకమైన మోకాలి నొప్పి . ఇది మోకాలి చిప్ప స్నాయువు షిన్‌తో అనుసంధానించే మోకాలి ప్రాంతంలో మంటను కలిగిస్తుంది. బాడీ పెరిగే క్రమంలో కొన్ని కండరాలు వేగంగా పెరుగుతాయి. మిగిలిన కండరాల పెరుగుదలకు కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈక్రమంలో ఏర్పడే ఒత్తిడి వల్ల కండరాలు లాగినట్టు నొప్పిని కలిగిస్తాయి. ఫలితంగా నొప్పి కలిగే ప్రాంతంలో మంట, చికాకు కలుగుతాయి. ఇటువంటి టైంల్ జంపింగ్ లేదా రన్నింగ్ వంటి శారీరక వ్యాయామాలు చేస్తే నొప్పి మరింత పెరుగుతుంది. ఈ టైంలో తగినంత విశ్రాంతిలో ఉండి.. మందులు వాడాలి.ఈ ప్రాబ్లమ్ దాదాపు దానంతట అదే సాల్వ్ అవుతుంది. శస్త్రచికిత్స అవసరం లేదు.

2. గూని (Scoliosis)

వెన్నెముకలో వంకరతనం ఏర్పడి వచ్చే సమస్యను గూని అంటారు. చెడు జీవనశైలి కారణంగా ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా పెద్దలను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని కేసులు టీనేజీ పిల్లల్లోనూ కనిపిస్తాయి. ప్రమాదం, జన్యు కారణాలు లేదా సెరిబ్రల్ పాల్సీ (CP) వంటి ఆరోగ్య సమస్యల కారణంగా పిల్లలకు గూని వస్తుంది. దీనివల్ల పార్శ్వగూని భుజాలు, నడుము, తుంటి , పక్కటెముక వంటి శరీరంలోని వివిధ భాగాలలో అసమానతను కలిగిస్తుంది. వెన్నెముక ఎంతమేర వంకరగా ఉందనే దాని ఆధారంగా చికిత్స ఉంటుంది.  కొంతమంది రోగులకు బ్రేస్ థెరపీ సరిపోతుంది. మరి కొందరికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. గూని అనేది నయం చేయలేని వ్యాధి. అయితే ఇది జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు.

3. బెణుకులు (Sprains)

బెణుకు అంటే.. చీలమండ ప్రాంతంలో ఎక్కువగా సంభవించే స్నాయువు చిరిగిపోవడం లేదా సాగదీయడమనే సమస్య. మరో మాటలో తీవ్రమైన కీళ్ళ గాయం కూడా చెప్పొచ్చు. దీనికి చికిత్సగా వైద్యుల సూచనతో కోల్డ్ కంప్రెషన్, పెయిన్ కిల్లర్ మందులు వాడొచ్చు. కీళ్లపై స్ట్రెయిన్‌ పడకుండా ఉండేందుకు కాలును కట్టుతో, కొంచెం ఎత్తులో ఉంచాలి. కొన్ని రోజుల తర్వాత సున్నితమైన సాగతీత వంటి భౌతిక చికిత్స కూడా సహాయపడుతుంది.

4. స్లిప్డ్ క్యాపిటల్ ఫెమోరల్ ఎపిఫిసిస్

స్లిప్డ్ క్యాపిటల్ ఫెమోరల్ ఎపిఫిసిస్ అనేది 10-15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను ప్రభావితం చేసే అరుదైన పరిస్థితి. ఈ రుగ్మత వల్ల గ్రోత్ ప్లేట్‌లో నష్టం సంభవించి.. తొడ ఎముక దాని పైభాగం నుంచి జారిపోతుంది. దీనివల్ల  గజ్జ ప్రాంతంలో నొప్పి కలుగుతుంది. తుంటిలో పట్టేసినట్టు అనిపిస్తుంది. కాళ్ల పొడవు అసమానంగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లలో కొందరికి శస్త్రచికిత్స అవసరం పడొచ్చు.

5. కౌమార వెన్ను నొప్పి (Adolescent Back Pain)

పెద్దలు అనుభవించే వెన్ను నొప్పి (బ్యాక్ పెయిన్) సమస్యనే.. కొందరు పిల్లలు కూడా ఫేస్ చేస్తుంటారు. సరిగ్గా కూర్చోక పోవడం, అసాధారణమైన ఒత్తిడి, కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల ఈ వెన్నునొప్పి వస్తుంది.

Also Read:  Tongue Health Tips: నాలుక తెల్లగా ఉందా? ఆ వ్యాధుల ముప్పు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • children
  • health
  • issues
  • Life Style
  • Orthopedic
  • problems

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd