HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Wrestlers Plan Women Mahapanchayat Outside New Parliament

Wrestlers Protest: రెజ్లర్ల నిరసన.. మే 28న కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద ‘మహిళా మహా పంచాయత్‌’..!

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశంలోని ప్రముఖ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద తమ నిరసన (Wrestlers Protest)ను కొనసాగిస్తున్నారు.

  • Author : Gopichand Date : 24-05-2023 - 7:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Wrestlers
Wrestlers

Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశంలోని ప్రముఖ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద తమ నిరసన (Wrestlers Protest)ను కొనసాగిస్తున్నారు. కాగా, ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట మహిళా మహా పంచాయత్ (Mahapanchayat) నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మంగళవారం (మే 23) నిరసన తెలిపిన రెజ్లర్లు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ తర్వాత రెజ్లర్ వినేష్ ఫోగట్ విలేకరులతో మాట్లాడుత.. “మేము మార్చి 28 న కొత్త పార్లమెంటు భవనం ముందు శాంతియుతంగా మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.” అని తెలిపారు.

మహా పంచాయత్‌ కి మహిళలు నాయకత్వం

ఈ మహా పంచాయత్‌కు మహిళలు నాయకత్వం వహిస్తారని వినేష్ ఫోగట్ తెలిపారు. దీంతో పాటు లేవనెత్తిన ఈ స్వరం ఎంతో దూరం వెళ్లాలని అన్నారు. ఈరోజు దేశపు ఆడపడుచులకు న్యాయం జరిగితే రాబోయే తరాలు ధైర్యం తెచ్చుకుంటాయన్నారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు ఏప్రిల్ 23 నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

Also Read: GT vs CSK: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్… చెపాక్ లో గుజరాత్ కు చెక్

బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు

బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఏప్రిల్ 28న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో పోస్కో కింద మైనర్ బాలిక ఫిర్యాదుపై సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇతర రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ నెల ప్రారంభంలో రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కాగా, రెజ్లర్ల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు రెజ్లింగ్ సమాఖ్య కార్యకలాపాలన్నింటినీ క్రీడా మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brijbhushan Sharan Singh
  • delhi
  • new parliament building
  • WFI
  • wrestlers
  • Wrestlers Protest

Related News

Delhi Alert

Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Latest News

  • Rape : బాలికను అత్యాచారం చేసిన జ్యోతిషుడు

  • Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు

  • YouTuber Komali : తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య..కారణం అదేనా ?

  • Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన గోల్డ్ ధర

  • Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd