India-Pakistan War : యుద్ధం వస్తే మన ముందు పాక్ నిలుస్తుందా? ఎవరి బలం ఎంత..?
India-Pakistan War : ప్రస్తుతం పాక్ కంటే భారత సైన్యం బలంగా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ స్థాయి భద్రతా బలగాలు, అణు ఆయుధ సామర్థ్యం వంటి అంశాల్లో పాకిస్థాన్ కంటే భారత్ మెరుగ్గా ఉన్నట్టు విశ్లేషకులు చెపుతున్నారు.
- By Sudheer Published Date - 09:27 PM, Thu - 24 April 25

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తే, పాక్ మన ముందు నిలబగలదా ? అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పాక్ కంటే భారత సైన్యం బలంగా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ స్థాయి భద్రతా బలగాలు, అణు ఆయుధ సామర్థ్యం వంటి అంశాల్లో పాకిస్థాన్ కంటే భారత్ మెరుగ్గా ఉన్నట్టు విశ్లేషకులు చెపుతున్నారు.
Pahalgam Terror Attack : మధుసూదన్ పాడే మోసిన మంత్రి నాదెండ్ల మనోహర్
భారత్ వద్ద సుమారు 14.55 లక్షల మంది యాక్టివ్ ఆర్మీ సైనికులు ఉన్నారు. వీరిలో 1.15 మిలియన్ రిజర్వ్ ఫోర్సులు, 25 లక్షల పారా మిలిటరీ బలగాలు కూడా ఉన్నాయి. అంతేకాదు భారత్ వద్ద 4500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, అధునాతన క్రూయిజ్ క్షిపణులు, భీమ్ ట్యాంకులు, అణు జలాంతర్గాములు ఉన్నాయి. అలాగే 6 వైమానిక ట్యాంకర్లు, 2299 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 యుద్ధ జెట్స్ దేశ రక్షణలో ఉన్నాయి.
పాక్ విషయానికి వస్తే.. వారి వద్ద సుమారు 6.5 లక్షల సైనికులు ఉన్నా, భారత్‌తో పోలిస్తే సాంకేతికంగా, ఆయుధ పరంగా వెనకబడి ఉన్నారు. పాక్ వద్ద కేవలం 1399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 జెట్స్, 4 వైమానిక ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. అణు జలాంతర్గాముల విషయంలోనూ భారత్ కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. అంటే యుద్ధం వస్తే పాకిస్థాన్ భారత్ ముందు ఎక్కువకాలం నిలవడం అసాధ్యమేనని రక్షణ నిపుణులు అంటున్నారు. కానీ యుద్ధం కాకుండా డిప్లొమసీ ద్వారానే సమస్యల పరిష్కారం జరగాలని శాంతికాముకులు ఆశిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Kalma : కల్మా అంటే ఏంటి ? దీనికి టెర్రరిస్టులకు సంబంధం ఏంటి..?