Pahalgam Terror Attack : మధుసూదన్ పాడే మోసిన మంత్రి నాదెండ్ల మనోహర్
Pahalgam Terror Attack : అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు కూడా పాల్గొన్నారు
- By Sudheer Published Date - 08:54 PM, Thu - 24 April 25

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదనరావు (Madhusudan Rao) ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచింది. మధుసూదన్ పార్థివ దేహం స్వస్థలమైన కావలికి తరలించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.
Pahalgam Terror Attack : భారత్ దెబ్బకు..పాక్ మేకపోతు గాంభీర్యం
పవన్ కల్యాణ్ మధుసూదనరావు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి వెంట ఉన్నదని, అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనను వ్యక్తిగతంగా తీసుకుని ఎంతో బాధపడ్డ పవన్, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి మానసికంగా ధైర్యం చెబుతూ, ప్రభుత్వ సహాయాలు అందేలా చూడనన్నారు.
అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు కూడా పాల్గొన్నారు. వారు మధుసూదనరావు పాడెను మోస్తూ చివరి గౌరవం తెలిపారు. ఈ చర్యకు సామాజిక వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ వర్షించింది. ఒక సామాన్య పౌరుడి విషాద సమయంలో రాష్ట్ర మంత్రులు స్వయంగా ముందుకు రావడం ప్రజా ప్రతినిధుల బాధ్యతాభావానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
ఇక సెలవు.. మధుసూదన్ పాడె మోసిన మంత్రులు
పహల్గామ్ ఉగ్రదాడిలో బలైన నెల్లూరు (D) కావలికి చెందిన మధుసూదన్ అంత్యక్రియలు సొంతూరులో ముగిశాయి. మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కావలి MLA కృష్ణారెడ్డి హాజరై పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు అంతిమయాత్రలో పాల్గొని… pic.twitter.com/3T9oGXIj9I
— ChotaNews App (@ChotaNewsApp) April 24, 2025